• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అఫ్తాబ్‌ను ఉరి తీయాలి: శ్రద్ధా తండ్రి

    తన కుమార్తెను హత్య చేసిన అఫ్తాబ్‌ను ఉరి తీయాలని శ్రద్ధావాకర్ తండ్రి వసంత్ ఆరోపించారు. శ్రద్ధాను ఎలా హింసించాడో.. ఆ నరకయాతనను అఫ్తాబ్ కూడా అనుభవించేలా చూడాలని ఆయన కోరారు. ముంబయి పోలీసులు కేసు స్వీకరిస్తే తన కుమార్తె శ్రద్ధా వాకర్ బతికేదని ఆమె తండ్రి వసంత్ బోరుమన్నారు. అఫ్తాబ్ వేధిస్తున్నాడని ముంబయిలోని వసయి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసిందని.. కానీ, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వాపోయారు. దిల్లీ పోలీసుల దర్యాప్తు సరైన దిశలోనే సాగుతుందన్నారు. శ్రద్ధావాకర్‌ను అఫ్తాబ్ హత్య చేసిన … Read more

    ఆర్థిక రాజధానిలో నిషేధాజ్ణలు

    వచ్చే నెల 1 నుంచి 15 వరకు ఆర్థిక రాజధాని ముంబైలో నిషేధాజ్ణలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముంబైలో లాఅండ్‌ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని, అందుకే ఆ రోజుల్లో నిషేధాజ్ణలు విధించారు. ఒకేచోట ఐదుగురికి మించి గుమిగూడటం, ఊరేగింపులు, బాణసంచా కాల్చడం, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, సంగీతంపై కూడా నిషేధం విధించారు. ఎవరైనా నిషేధాజ్ణలు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష విధించనున్నారు.

    KRKను అరెస్టు చేసిన పోలీసులు

    కమల్ ఆర్ ఖాన్(KRK) ట్వీట్‌లు అతన్ని తాజాగా మళ్లీ ఇబ్బందుల్లోకి నెట్టాయి. నటుడు, విమర్శకుడైన KRK 2020లో చేసిన వివాదాస్పద ట్వీట్‌ను ఉద్దేశించి మలాడ్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. KRKని ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. యువ సేన సభ్యుడు రాహుల్ కనల్ మలాడ్ పోలీస్ స్టేషన్‌లో కమల్ ఆర్ ఖాన్‌పై ఫిర్యాదు చేశారు. KRKపై లుక్‌అవుట్ నోటీసు జారీ చేసిన తర్వాత అతనిపై 2020లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.