నాకెవరూ ప్రపోజ్ చేయట్లేదు; అనన్య
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. తరచూ తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాలో లైవ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు’ అంటూ ప్రశ్నించాడు. దానికి అనన్య రిప్లై ఇస్తూ..‘నాకు బాయ్ ఫ్రెండ్ లేడు.. కానీ ఉన్నాడని అనుకుంటున్నారు.. అందుకే నాకు ఎవరూ ప్రపోజ్ చేయడం లేదు’’ అంటూ చెప్పింది. దీంతో నెటిజన్స్ ఈ భామకు ప్రపోజ్ చేయడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.