ఆన్లైన్లో పీహెచ్‌డీనా ఇది చదవండి
ఆన్లైన్లో పీహెచ్డీ ప్రోగ్రామ్‌లపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు యూజీసీ, ఏఐసీటీఈ సూచించింది. విదేశీ విద్యాసంస్థల సహకారంతో ఎడ్టెక్ కంపెనీలు అందించే కోర్సులకు గుర్తింపు లేదని చెప్పింది. ఆన్లైన్లో ప్రకటనలు చూసి మోసపోవద్దని హెచ్చరించింది. యూజీసీ 2016 నిబంధనల ప్రకారం ఎన్నుకోవాలని పేర్కొంది. భారతీయ విద్యాసంస్థలన్ని నిబంధనలు అనుసరించాలని స్పష్టం చేసింది. యూజీసీ, ఏఐసీటీఈ ఇలాంటి హెచ్చరికలు జారీచేయడం రెండోసారి.