• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హీరోయిన్‌తో బాలయ్య నైట్ పార్టీ; మందు గ్లాసుతో?

  నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ వేడుకలో బాలయ్య, హనీరోజ్ హైలెట్‌గా నిలిచారు. పార్టీలో వీరిద్దరూ ఒకరికి ఒకరు తాగిపించుకుంటున్నట్లుగా కలసి ఆల్కహాల్‌ను ఆస్వాదించారు. చేతులు మార్చుకుంటూ మరీ మద్యం సేవించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా హనీరోజ్ ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

  అక్కినేని ఫ్యామిలీతో అడివి శేష్

  అక్కినేని ఫ్యామిలీతో హీరో అడివి శేష్ సందడి చేశాడు. క్రిస్మస్ పండుగను అక్కినేని కుటుంబసభ్యులతో కలసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ మరికొంతమంది పాల్గొన్నారు. కాగా ఈ ఫొటోను చూసి అక్కినేని ఫ్యామిలీలో అడివి శేష్ ఎందుకు ఉన్నాడంటూ నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ ఇచ్చినందుకు అఖిల్ బ్రోకు థ్యాంక్స్ అంటూ శేష్ కామెంట్ చేశాడు.

  ఆస్పత్రి పాలైన క్రికెటర్ ఖలీల్

  తను ఎంతగానో ప్రేమించే క్రికెట్‌ను మిస్ అవుతున్నానంటూ భారత పేసర్ ఖలీల్ అహ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మోకాలి నొప్పికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఫొటో కూడా షేర్ చేసుకున్నాడు. రాబోయే రంజీ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లను మిస్ అవుతానని, క్రికెట్‌కు దూరంగా ఉండాలంటే కష్టంగా ఉందన్నాడు. ప్రస్తుతం కోలుకుంటు న్నానని, తిరిగి ఫిట్‌గా మైదానంలో అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. దీనిపై ఖలీల్‌కు ఏమైంది? అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

  చార్టెడ్ ఫ్లైట్‌లో ఎన్టీఆర్; పిక్ వైరల్

  కన్నడ రాజ్యోత్సవ వేడుకలకు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక విమానంలో వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్‌లో ఎంతో ట్రెండీగా ఉన్నాడు. స్టైలిష్ లుక్‌లో, ట్రెండీ స్టైల్ ఫార్మల్ డ్రెస్‌లో ఎన్టీఆర్ కనిపించారు. బెంగళూరులోని విధానసౌధలో జరిగే రాజ్యోత్సవ వేడుకల్లో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు ఎన్టీఆర్ కర్నాటక రత్న అవార్డు ఇవ్వనున్నారు. ఈ అవార్డును పునీత్ సతీమణి స్వీకరించనుంది.

  జపనీస్ ఫుడ్ ఆస్వాదిస్తున్న ‘ఆర్‌సీ’ దంపతులు

  మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు జపాన్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి రెస్టారెంట్లలో ఫ్రెండ్స్‌తో కలసి ఫేమస్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్ వైరల్‌గా మారింది. కాగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్‌లో భాగంగా రామ్‌చరణ్, ఉపాసన జపాన్‌కు వెళ్లారు. అక్టోబర్ 21న జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం రామ్‌చరణ్ దంపతులు జపాన్ వెళ్లారు.

  పోలీస్‌కే చలాన్.. ట్విస్ట్

  తోటి పోలీస్‌కు చలాన్ విధించిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులోని ఆర్‌టీ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ పోలీస్ నిషేధించిన హాఫ్ హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్నందుకు ఈ జరిమానా విధించాడు తోటి పోలీస్. జరిమానా విధించిన పోలీస్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చలానా విధించిన ఫొటోను బెంగళూరు పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

  జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు

  తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఒకే బాత్‌రూమ్‌లో రెండు కమ్మోడ్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ బాత్‌రూమ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద జోక్‌గా మారాయి. SIPCOT సంస్థకు సంబంధించిన నూతన భవనంలో ఈ బాత్ రూమ్ నిర్మించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ బాత్‌రూమ్ ఇంజనీర్ ఎవరా అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు.