మోదీ గారు మా 3 హామీల సంగతేంటి?: KTR
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు. “మా 3 ప్రధాన హామీల సంగతేంటి? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు? బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు? పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?మూడ్రోజుల్లో రెండోసారి వస్తున్నారు.. ఆ 3 విభజన హక్కులకు దిక్కేది? పదేళ్ల నుంచి పాతరేసి ఎంతకాలం ఈ అబద్ధాల జాతర? మీ మనసు కరిగేదెప్పుడు, తెలంగాణ గోస తీరేదెప్పుడు? “అని ప్రశ్నించారు.