• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Puri Jagannath: సక్సెస్ కోసం ఈ డైరెక్టర్ వేచి చూడాల్సిందేనా?

    పూరీ జగన్నాథ్.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ని సృష్టించిన టార్చ్‌బేరర్. పడిలేచిన దర్శక కెరటం. ఇండస్ట్రీకి మైలు రాళ్లవంటి సినిమాలు అందించిన డైరెక్టర్. కానీ, పూరీ మార్క్ సినిమా చూడక చాలా ఏళ్లయింది. లైగర్‌తో వచ్చినా.. అది నిరాశే పరిచింది. దీంతో పూరీపై ఇండస్ట్రీలో నమ్మకం సడలుతోందని, తన మేకింగ్‌తో ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాడని చర్చ నడుస్తోంది. అసలు పూరీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు నిలబడ లేకపోతున్నాయి? మార్పు ఎక్కడ వచ్చింది? … Read more

    టాలీవుడ్‌లో కొత్త కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేసిన జల్సా-పోకిరి

    మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డేకు ‘పోకిరి’ సినిమా స్పెష‌ల్ షోలు వేయ‌డంతో టాలీవుడ్‌లో కొత్త కాన్సెప్ట్ ప్రారంభ‌మైంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నేడు ప్ర‌పంవ్యాప్తంగా జ‌ల్సా స్పెష‌ల్ షోల‌ను నిర్వ‌హించారు. అయితే ఈ రెండు సినిమాల‌కు కొత్త‌గా రిలీజ్ అయినంత క్రేజ్ రావ‌డం విశేషం. అభిమానుల‌తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయాయి. అక్టోబ‌ర్‌లో ప్రభాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బిల్లా సినిమాను కూడా రిలీజ్ చేయ‌నున్నారు. దానికి కూడా ఇదే ట్రెండ్ కొన‌సాగుతుంద‌ని ఆశిస్తున్నారు.

    పోకిరి క‌లెక్ష‌న్స్ మొత్తం డొనేట్ చేసిన సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌

    ఆగ‌స్ట్ 9న మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘పోకిరి’ స్పెష‌ల్ షోలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఫ్యాన్స్‌తో థియేట‌ర్లు నిండిపోయి చాలామందికి టిక్కెట్లు దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో పోకిరికి మ‌రోసారి భారీ క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. అయితే ఆ డ‌బ్బును మొత్తం సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్ మ‌హేశ్‌బాబు ఫౌండేష‌న్‌, తెలుగు ఫిల్మ్ డైరెక్ట‌ర్స్ ట్ర‌స్ట్‌కు డొనేట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అభిమానులు చేస్తున్న ఈ మంచిప‌నికి నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

    రూ.1.73 కోట్ల గ్రాస్ రాబట్టిన పోకిరి

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ పోకిరి మరో అరుదైన రికార్డు సృష్టించింది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా స్పేషల్ షోలు వేశారు. ఆ ఒక్కరోజులోనే రూ.1.73కోట్లు రాబట్టిందని మూవీ మేకర్స్ తెలిపారు. భారత దేశంలో మరే ఇతర సినిమా ఈ ఘనత సాధించలేదని వెల్లడించింది. ఇది మహేష్ అభిమానులకు గుర్తిండిపోయే రోజు అని పేర్కొంది.

    HBD MAHESH BABU: ఒక్క‌డు, పోకిరి సినిమాల‌కు ఎందుకంత క్రేజ్?

    సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ఆగ‌స్ట్ 9న పుట్టిన‌రోజు సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా పోకిరి, ఒక్క‌డు సినిమాలు స్పెష‌ల్ షోలు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. విదేశాల్లో పోకిరీ స్పెష‌ల్ షోస్‌కి భారీ క్రేజ్ ఏర్ప‌డింది. దీంతో లొకేష‌న్ల‌ను కూడా పెంచుతున్నారు. ఇప్ప‌టికే స్పెష‌ల్ షో ప్రీ-బుకింగ్ క‌లెక్ష‌న్ల‌లో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. పోకిరికి పోటీగా కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికే ఒక్క‌డు సినిమా ప్ర‌త్యేక షోలు నిర్వ‌హించారు. థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ హ‌ల్‌చ‌ల్ మామూలుగా లేదు. మ‌హేశ్ కెరీర్‌లో ఒక్క‌డు, పోకిరి సినిమాల‌కు ఎందుకంత క్రేజ్?. మ‌హేశ్‌ను … Read more

    ‘పోకిరి’ క్రేజ్..ఓవ‌ర్సీస్‌లో లొకేష‌న్ల‌ పెంపు

    ఆగ‌స్ట్ 9న సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పోకీరి స్పెష‌ల్ షోలు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమాకు భారీగా క్రేజ్ ఏర్ప‌డింది. అందుకే మెల్‌బోర్న్, ఆస్ట్రేలియాలో మరో కొత్త లొకేషన్ యాడ్ చేశారు. ఆగ‌స్ట్ 9న‌ రాత్రి 8.45కి స్పెష‌ల్ షో ప్లాన్ చేశారు. టిక్కెట్ బుకింగ్స్‌ సోమ‌వారం నుంచి ప్రారంభ‌మ‌వుతాయి. ఇక నైజాం ఏరియాలో 20 షోల‌కు మొత్తం టిక్కెట్లు అమ్ముడ‌య్యాయి. దీంతో మ‌హేశ్‌తో పాటు పోకిరి సినిమా క్రేజ్ ఏంటో మ‌రోసారి అర్థ‌మ‌వుతుంది.

    అమెరికాలో ‘పోకిరి’ స్పెష‌ల్ షో బుకింగ్స్‌లో కొత్త రికార్డు

    సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 9న పోకిరి మూవీ స్పెష‌ల్ షోలు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. అమెరికాలో ఇప్ప‌టికే 11 లొకేష‌న్ల‌లో 14 షోల‌కు గాను 586 టిక్కెట్లు అమ్ముడ‌వ‌గా 4,053 డాలర్లు గ్రాస్ వ‌సూల‌య్యాయి. ఒక సినిమా స్పెష‌ల్ షో కోసం ఇంత‌మేర‌కు క‌లెక్ష‌న్లు రావ‌డం, ఇన్ని లొకేష‌న్ల‌లో విడుద‌ల చేయ‌డం ఇదే మొద‌టిసారి. ఇంకా ఒక వారం స‌మ‌యం ఉండ‌గానే సినిమాకు ఇంత క్రేజ్ ల‌భిస్తుంది. మ‌హేశ్‌బాబు కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌డంతో పాటు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సినిమా పోకిరి. … Read more

    ఒక్క‌డు స్పెష‌ల్ షో..ఇప్పటికీ అదే రెస్పాన్స్

    ఆగ‌స్ట్ 9న సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘పోకిరి’ సినిమాను 4Kలో తిరిగి రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన టిక్కెట్లు మొత్తం బుక్ అయిపోయాయి. అయితే మ‌రోవైపు ఈరోజు రాజ‌మండ్రిలో ‘ఒక్క‌డు’ సినిమా స్పెష‌ల్ షో వేశారు. ఈ సినిమా చూసేందుకు వ‌చ్చిన‌ ఫ్యాన్స్ థియేట‌ర్‌లో సంద‌డి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌చేసిన ‘ఒక్క‌డు’ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు. https://youtube.com/watch?v=2tfUHrZQ1qc

    గంటలోపే పోకిరి టికెట్లు సోల్డ్ అవుట్

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ పోకిరి మరో రికార్డు సృష్టించింది.ఈ మూవీ టికెట్లను ఆన్ లైన్ లో పెట్టిన గంటలోపే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.ఇంతవరకు ఏ భారతీయ చిత్రం ఈ ఘనత సాధించ లేదు. పోకిరి సినిమాను మహేష్ బర్త్ డే(AUG 9) సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు విడుదలయ్యే సినిమా ప్రింట్ ను 4K రిజల్యూషన్‌లోకి రీమాస్టర్ చేసి.. డాల్బీ ఆడియో టెక్నాలజీతో రూపొందించారు. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పోకిరి … Read more

    4K ప్రింట్‌లో పోకిరి.. మ‌రోసారి థియేట‌ర్ల‌లో విడుద‌ల‌

    ‘పోకిరి’ సినిమాకు ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా వ‌చ్చి ప‌ద‌హారేళ్ల‌యినా ఇప్ప‌టికీ అది టీవీలో వ‌స్తే క‌న్నార్ప‌కుండా చూసేవాళ్లున్నారు. మ‌హేశ్ బాబును మాస్ హీరోలా మార్చిన సినిమా అది. డైలాగ్స్‌, యాక్ష‌న్ పూరీ జ‌గ‌న్నాథ్‌ను ఇండ‌స్ట్రీలో పెద్ద డైరెక్ట‌ర్‌గా నిల‌బెట్టింది. అయితే ఇప్పుడు పోకిరినీ 4Kప్రింట్‌లో మ‌రోసారి థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్నారు. మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 9న పెద్దఎత్తున పోకిరీని సెల‌బ్రేట్ చేయ‌నున్నారు. ఈ వార్త‌తో ఫ్యాన్స్ పండ‌గ‌చేసుకుంటున్నారు.