రికార్డు సృష్టించిన PS-1
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ మూవీ రికార్డు సృష్టించింది. తమిళ్లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూలు చేసిన మూవీగా నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో అలరిస్తుంది. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.