• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నేను ఆ ముగ్గురినే నమ్ముతా; బాలకృష్ణ

  తాను సినిమాల విషయంలో ముగ్గురిని మాత్రమే నమ్ముతానని సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్‌ను పూర్తిగా నమ్ముతానని చెప్పారు. ‘వీరసింహారెడ్డి’ విజయంతో మూవీ టీమ్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ‘‘తాను నటించిన ‘వీరసింహారెడ్డి’ని ఆదరించినందుకు కృతజ్ణతలు. ఈ సినిమా కోసం ప్రతి డిపార్ట్‌మెంట్ తీవ్రంగా కృషి చేసింది. తమన్ పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారు. మంచి ఔట్‌పుట్ రాబట్టగలిగే సత్తా గోపీచంద్‌కు ఉంది.’’ అంటూ బాలయ్య పేర్కొన్నారు.

  ‘డబుల్ కాదు.. ట్రిపుల్ బాదేవాడిని’

  అవుట్ కాకపోయుంటే డబుల్ సెంచరీ కాదు.. ట్రిపుల్ సెంచరీనే బాదేవాడినని టీమిండియా యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ అన్నాడు. బంగ్లాతో మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేసిన అనంతరం ఇషాన్ మీడియాతో మాట్లాడాడు.‘‘ బ్యాటింగ్‌కు వెళ్లగానే బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నాను. సిక్సర్‌తో సెంచరీ చేద్దామనుకున్నా. కోహ్లీ సింగిల్స్ తియ్యమనడంతో అలాగే చేశా. ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ చేసి ఉంటే ట్రిపుల్ సెంచరీ కూడా కొట్టేవాడినేమో. నన్ను నేను నమ్మలేకపోతున్నా.’’ అంటూ పేర్కొన్నాడు.

  మా ఓటమికి కారణం అదే; రోహిత్ శర్మ

  బంగ్లాతో జరిగిన మొదటి వన్డేలో బ్యాటింగ్‌లో విఫలం కావడం వల్లే టీమిండియా ఓడిపోయిందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మరో 25 నుంచి 30 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని పేర్కొన్నాడు. నామమాత్రపు స్కోరు చేయడంతోనే తాము ఓడిపోయామన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారని చెప్పాడు. తక్కువ స్కోర్ ఉన్నా మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకొచ్చారని ప్రశంసించాడు. తొలి బంతి నుంచే బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారని పేర్కొన్నాడు.

  అందుకే డిపాజిట్లు కోల్పోయా; పాల్వాయి స్రవంతి

  తమ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీ వైపు మళ్లిందని, అందుకే తాను డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయానని మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ధన, అధికార బలంతో పోటీ చేశాయని, కానీ తాను ప్రజాబలంతో పోటీ చేశానని చెప్పారు. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కలసి రూ.500 కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రలోభాలతో గెలిచిందని విమర్శించారు. ఇక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంగతి హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.

  ‘మా భవిష్యత్ సీఎం కేటీఆర్’

  తమ భవిష్యత్ సీఎం కేటీఆర్ అని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కేటీఆర్ అని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు, ఎక్కడైనా పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. గతంలో చిరంజీవి వచ్చాడు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ వస్తారేమో అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం మునుగోడులో ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యలో శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

  ‘పవన్‌పై కక్షతోనే కుట్రలు’

  జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కావాలనే ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. విశాఖలో పవన్‌ను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ అధినేతలకే రక్షణ లేకుంటే ఇక సామాన్య ప్రజలకు రాష్ట్రంలో రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ లాంటి నీచమైన పార్టీని తాను ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

  ‘అందరూ బాగున్నారా’!

  మేము ఎప్పడు పాకిస్తాన్ ఆటగాళ్లను కలిసినా అందరూ బాగున్నారా?, మీ కుటుంబం ఎలా ఉంది? కొత్త కారు కొన్నారా? పాత కారు ఏమైనా అమ్మారా? లాంటి విషయాలు చర్చించుకుంటాం అని భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. టీ20 వరల్డ్‌కప్ ముందు శనివారం ఐసీసీ ‘కెప్టెన్స్‌డే’ నిర్వహించింది. ఇందులో రోహిత్ మీడియాతో మాట్లాడాడు. సహజంగా పాక్‌తో పోరు అంటే ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. ప్రతిసారీ ఒత్తిడి స‌ృష్టించడంలో అర్ధం లేదని, పాక్‌తో ఆటను మేము అర్ధం చేసుకున్నామని పేర్కొన్నాడు.

  ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం

  ఉత్తరాంధ్రకు చంద్రబాబునాయుడు అన్యాయం చేశారని ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు తన హయాంలో ఒక్క సంస్థనైనా తీసుకువచ్చారా అని చంద్రబాబును ప్రశ్నించారు. విశాఖకు పరిపాలన రాజధాని వస్తే నష్టమేంటని నిలదీశారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని ప్రాంతాల వారు నివసించే పరిస్థితి వైజాగ్‌లో ఉందని, కానీ అమరావతిలో వేరే వర్గం వారు నివసించే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు.

  కాంగ్రెస్‌వి డర్టీ పాలిటిక్స్; బొమ్మై

  రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ చేస్తోందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు. అంతిమంగా సత్యమే గెలుస్తుందని బొమ్మై అభిప్రాయపడ్డారు. కాగా ఇటీవల ‘పేసీఎం’ అంటూ బెంగళూరు అంతటా పోస్టర్లు వెలసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ల క్యాంపెయిన్‌ను కాంగ్రెస్ పార్టీనే చేపట్టిందనే ఆరోపణలతో పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్టులు కూడా చేశారు.

  చైతూ హ్యాపీ: నాగార్జున

  నాగచైతన్య-సమంత విడాకుల విషయంపై ఎట్టకేలకు నాగార్జున స్పందించారు. ఈ విషయంపై నాగ్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘నాగచైతన్య ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను ఆయనను గమనిస్తూనే ఉన్నా. ఈ విషయం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. చైతూ-సామ్ విడాకులు తీసుకోవడం దురద‌ృష్టకరమే. కానీ అదొక అనుభవంగా మిగిలిపోతుంది. ప్రజలు కూడా ఈ విషయం మరిచిపోతే మంచిది’ అని పేర్కొన్నాడు. కాగా నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ చిత్రంలో నటించారు. వచ్చే నెల 5న ఈ చిత్రం విడుదల కానుంది.