VIDEO: బ్రిటన్ రాణి భారత్ టూర్
70ఏళ్ల పాటు బ్రిటన్ రాణిగా సేవలందించిన ఘనత ఎలిజబెత్ 2 సొంతం. ఆమె ఇక లేరు. ఆమె జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉంటాయి. బ్రిటన్ రాణి తొలిసారి 1961లో భారత్ లో పర్యటించారు. దిల్లీలోని ఎర్రకోటను, ఆగ్రాలోని తాజ్ మహల్ ను దర్శించుకున్నారు. 1983లో మరోసారి ఇండియాకు వచ్చారు. 1997లో భారత్ లో పర్యటించినప్పుడు.. అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని ఆమె సందర్శించారు. జలియన్ వాలా బాగ్ మారణకాండలో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించారు.