ఉచితంగా రేషన్ బియ్యం
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదాలకు తీపి కబురు అందించింది. రేషన్ బియ్యాన్ని ఇక నుంచి ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇప్పటివరకు కిలోకి రూ. 1 తీసుకున్నారు. ఇకపై రూపాయి కూడా తీసుకోవద్దని నిర్ణయించారు. కేవలం పంచదార, కందిపప్పుకు మాత్రమే డబ్బులు చెల్లించాలని అధికారులు సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతినెల 16,474 మెట్రిక్ టన్నులు ఉచితంగా ఇస్తారు. కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున పంపిణీ జరుగుతోంది.