• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BHOLASHANKAR: షికారుకు వచ్చిన షేర్!

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘భోళాశంకర్’ మూవీ టీజర్ విడుదలైంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్య 70ఎంఎంలో టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో ‘షికారుకు వచ్చిన షేర్‌ను బే’ అంటూ చిరు మాస్ డైలాగ్స్ పలికాడు. యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. కాగా ఈ సినిమాలో చిరు సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. మొహర్ రమేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఆగష్టు 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ‘స్పై’ ట్రైలర్ వచ్చేసింది

    టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘స్పై’ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇవాళ సాయంత్రం మూవీ మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. నిఖిల్ యాక్టింగ్ అదరగొట్టాడనే చెప్పాలి. కాగా ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్యమీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని గ్యారీ బీహెచ్ డైరెక్ట్ చేశాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు.

    ‘రంగబలి’ టీజర్ వచ్చేసింది!

    టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా, యుక్తి తరేజా హీరోయిన్‌గా తెరకెక్కిన ‘రంగబలి’ మూవీ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ను బట్టి చూస్తే పూర్తి కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. టీజర్ ఆకట్టుకునేలా ఉండడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. కాగా ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. చెరుకూరి సుధాకర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేయనున్నారు.

    ‘సైతాన్’ ట్రైలర్: ‘రానానాయుడు’కు మించి!

    డైరెక్టర్ మహీ వి రాఘవ్ తెరకెక్కించిన ‘సైతాన్’ వెబ్ సీరీస్ ట్రైలర్ విడుదలైంది. క్రైమ్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సీరీస్ అంతా బూతులమయంగా ఉంది. ఇందులోని బూతు డైలాగులకు ఫ్యామిలీ ఆడియన్స్ చెవులు మూసుకోవాల్సిందే. ట్రైలర్‌లో పచ్చి బూతులు, అడల్ట్ సన్నివేశాలే కన్పిస్తాయి. బూతుల్లో ‘సైతాన్’ సీరీస్ ‘రానానాయుడు’ వెబ్ సీరీస్‌కు మించి ఉంది. షెల్లి నబుకుమార్, దేవయాని శర్మ, జాఫర్ సాధిక్, రిషి కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సీరీస్ జూన్ 15 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

    ఆసక్తికరంగా ‘సత్తిగాని రెండెకరాలు-1’ ట్రైలర్

    జగదీష్ ప్రతాప్ భండారీ, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తిలు ప్రధాన పాత్రలు పోషించిన ‘సత్తిగాని రెండెకరాలు-1’ చిత్రం విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 26న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సత్యదేవ్, వెంకీ కుడుముల, అనుదీప్‌లు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. డార్క్ కామెడీ జానర్లో మూవీని రూపొందించారు. ఈ సినిమాకు అభినవ్ దండా దర్శకత్వం వహించారు. మైత్రీమూవీమేకర్స్ వారు నిర్మించారు.

    థ్రిల్లింగ్‌గా ‘స్పై’ టీజర్!

    యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ‘స్పై’ మూవీ టీజర్ విడుదలైంది. ఢిల్లీలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాతో గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారాడు. జూన్ 29న పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.

    ‘అహింస’ నుంచి మరో సాంగ్ ప్రొమో

    టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు అభిరామ్ హీరోగా, గీతికా హీరోయిన్‌గా తెరకెక్కిన ‘అహింస’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జూన 2న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే సినిమా టీజర్, పోస్టర్స్, మూడు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. తాజాగా మరో సాంగ్ ప్రొమోను విడుదల చేశారు. ‘‘ఉందిలే.. ఉందిలే’’ అంటూ సాగే పాటను ప్రేక్షకుల కోసం వదిలారు. ఈ సాంగ్‌ను చంద్రబోస్ రాయగా జావేద్ ఆలీ, జయశ్రీ పాడారు.

    ‘కస్టడీ’ మేకింగ్ వీడియో: కృతిశెట్టి కష్టం చూశారా?

    యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాలోని ఓ హైలెట్ సీన్ మేకింగ్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన కాసేపట్లోనే వైరల్‌గా మారింది. అండర్ వాటర్ సీక్వెన్స్ ఎలా షూట్ చేశారనేది చూపించారు. ఈ సీన్ కోసం చైతూ, కృతిశెట్టి ఎంత కష్టపడ్డారో వీడియోలో చూడవచ్చు. కాగా ఈ మూవీని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. The highly … Read more

    ఆసక్తిగా ‘కస్టడీ’ ట్రైలర్

    యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలో చైతూ పవర్‌ఫుల్ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ మూవీని డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఈ సినిమాలో అరవిందస్వామి, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

    ఆసక్తికరంగా ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్!

    టాలీవుడ్ హీరో సుధీర్ బాబు పోసాని హీరోగా నటించిన ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీలో సుధీర్ బాబు మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని నటుడు, రచయిత హర్షవర్ధన్ తెరకెక్కించారు. సుధీర్ సరసన ఈషా రెబ్బ, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో విడుదల చేయనున్నారు.