• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒక్కొక్కరు రూ. 100 పంపించినా చాలు: రేణూ

    నటి రేణూ దేశాయ్‌కి పెంపుడు జంతువులు అంటే ఎంతో ఇష్టమన్న విషయం తెలిసిందే.. తాజాగా ఆమె ఓ మూడు కుక్కలకు ఆపరేషన్‌ చేయించేందుకు ఓ సంస్థకు విరాళం ఇచ్చారు. తన వంతుగా రూ.30 వేలు విరాళం ఇచ్చి.. మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరంటూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. ‘నేను రూ.30 వేలు సర్దాను. మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరు. ఒక్కొక్కరు రూ. 100 పంపించినా చాలు’ అని రేణూ దేశాయ్‌ తన ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌కి విజ్క్షప్తి చేశారు.

    మహేశ్‌ సినిమా వదులుకున్నా: నటి రేణూ

    నటి రేణూ దేశాయ్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. మహేశ్‌బాబు హీరోగా చేసిన ‘సర్కారు వారి పాట’లో తనకు అవకాశం వచ్చిందని తెలిపింది. ‘కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. ఆ కారణం ఏంటో ఇప్పుడు చెప్పలేను. ఈ సినమాలో బ్యాంక్‌ ఆఫీసర్‌ పాత్ర కోసం నన్ను అడిగారు. ఆ రోల్‌ నాకెంతో నచ్చింది. యాక్ట్‌ చేయాలనుకున్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు’. అని రేణూ చెప్పుకొచ్చింది.

    అందుకే రెండో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా: రేణూ

    తన రెండో పెళ్లిపై నటి రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రేణూ క్లారిటీ ఇస్తూ. ‘రెండో పెళ్లిని ఇంట్లో పెద్దలు కుదిర్చారు. అప్పుడు మా అమ్మాయికి 7 ఏళ్లు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే పాపకు సరిగా సమయం కేటాయిస్తానో.. లేదో అనిపించింది. అందుకే క్యాన్సిల్‌ చేసుకున్నా. ఆద్యకు ఇప్పుడు 13ఏళ్లు. తను ఇంకాస్త పెద్ద అయ్యాక నా రెండో పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటా’ … Read more

    అందుకే సినిమాల్లోకి రీ ఎంట్రీ: రేణూ దేశాయ్

    రవితేజ హీరోగా చేస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో నటి రేణూదేశాయ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.. అందులో ఆమె గుర్రం జాషువా కూమార్తె ‘హేమలత లవణం’గా కనిపించబోతున్నారు. ఈ పాత్రపై రేణూ స్పందిస్తూ.. దర్శక, నిర్మాతల వల్లే ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నానని పేర్కొన్నారు. ఏదో జన్మలో పుణ్యం వల్లే ఈ పాత్ర పోషించే అవకాశం దక్కిందని చెప్పారు. తన పోస్టర్ చూసి అకీరా ఎంతో సంతోషించాడని రేణూ చెప్పుకొచ్చారు.