ప్రపంచ అపర కుబేరుడు రిటైర్మెంట్!
ప్రపంచ అపర కుబేరుడుగా ఉన్న ట్విటర్ సీఈఓ ఎలన్ మస్క్ రికార్డు స్థాయి నష్టాలు ఎదుర్కొని రెండో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం ఈ స్థానాన్ని ఫ్రాన్స్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆక్రమించాడు. కానీ బెర్నార్డ్ రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఇద్దరు భార్యల ద్వారా 5 మంది సంతానం ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పజెప్పుకుంటూ వస్తున్నారు.ఆయన పెద్ద కూతురు డెల్ఫైన్కు తన లగ్జరీ వస్తువుల కంపెనీ ‘ఎల్వీఎంహెచ్’ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.