• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tennis Superstar Sania Mirza Top 5 Achievements

    ప్ర‌స్తుత 2022 సీజన్ తర్వాత ఆట‌కు రిటైర్మెంట్ తీసుకోనున్న‌ట్లు టెన్నిస్ సూప‌ర్‌స్టార్ సానియా మీర్జా బుధ‌వారం ప్ర‌క‌టించింది. దీంతో ఇప్పటివరకు 43 డబుల్స్ టైటిల్‌లతో పాటు ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న సానియా అద్భుతమైన కెరీర్‌కు తెరప‌డ‌నుంది. ఆమె గ్రాండ్ స్లామ్ గెలిచిన మొదటి భారతీయురాలు.. భారతదేశపు మొదటి మహిళా టెన్నిస్ సూపర్ స్టార్ కూడా. 35 ఏళ్ల సానియా ఆమె కెరీలో సాధించిన టాప్ 5 విజ‌యాలు గురించి తెలుసుకుందాం. 

    1. WTA టైటిల్‌ను గెలుచుకున్న ఏకైక భారతీయ మహిళ

    మహిళల టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళ సానియా మీర్జా. ఆమె రెండు WTA ఫైనల్స్‌ను 2014లో కారా బ్లాక్‌తో కలిసి గెలిచింది, తర్వాత 2015లో మ‌రో WTA కిరీటాన్ని స్విస్ లెజెండ్ మార్టిన్ హింగిస్‌తో భాగస్వామ్యంతో సొంతం చేసుకుంది.

    2. మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్

    సానియా.. డబుల్స్ విభాగంలో సీరియల్ విజేతగా నిలిచింది. మొత్తంగా, ఆమె తన కెరీర్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది, వాటిలో 3 మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కాగా.. మహిళల డబుల్స్‌లో మార్టినా హింగిస్‌తో కలిసి మ‌రో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను గెలుచుకుంది. 2015లో వింబుల్డన్, 2015 US ఓపెన్‌ను గెలుచుకోవడం ద్వారా ఈ జంట తమ మొదటి రెండు గ్రాండ్‌స్లామ్‌లను నమోదు చేసుకున్నారు. తర్వాత, సానియా- మార్టినా 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను కూడా గెలుచుకుని తమ మూడవ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

    3. మూడు మిక్స్‌డ్ డ‌బుల్స్ గ్రాండ్ స్ల‌మ్స్‌

    మహిళల డబుల్స్‌లో ఘ‌న‌త‌తో పాటు, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలోనూ సానియా మూడు గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకుంది. తోటి భారత సూపర్ స్టార్ మహేష్ భూపతితో కలిసి, 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకోవడం ద్వారా సానియా తన మొదటి రెండు మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకుంది. బ్రెజిలియన్ టెన్నిస్ ప్లేయర్ బ్రూనో సోరెస్‌తో కలిసి మూడో గ్రాండ్‌ను 2014 యూఎస్‌ ఓపెన్‌లో సొంతం చేసుకుంది.

    4. డ‌బుల్స్ కేట‌గిరీలో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్

     ఏప్రిల్ 13, 2015న డబుల్స్‌లో సానియా ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది సానియా మిర్జా. దీంతో ఆమె కెరీర్‌లో శిఖ‌రాగ్రానికి చేరుకుంది.

    5. దేశానికి 14 ప‌త‌కాలు

    సానియా మీర్జా వేర్వేరు స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌లో భారతదేశానికి 6 బంగారు పతకాలతో సహా 14 పతకాలను అందించింది. ఆమె ఆసియా గేమ్స్‌లో మహిళల, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో వివిధ ఎడిషన్‌లలో మొత్తం 7 పతకాలను గెలుచుకుంది. అంతేకాకుండా, ఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్ రజత పతకాన్ని.. అలాగే మహిళల డబుల్స్‌లో కాంస్యాన్ని సాధించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv