మసాజ్ చేసింది ఖైదీయేనట
జైలులో దిల్లీ మాజీ మంత్రికి మసాజ్ చేస్తున్న వీడియో ఇటీవల చర్చనీయాంశమైంది. మనీ లాండరింగ్‌కి పాల్పడి దిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ జైలు జీవితం గడుపుతున్నారు. తాజాగా, ఈ ఘటనపై మరో విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రికి మసాజ్ చేసింది ఫిజియోథెరపిస్టు కాదట. అదే జైలులో అత్యాచారం కేసు కింద శిక్ష అనుభవిస్తున్న మరో ఖైదీ రింకునే సత్యేంద్ర జైన్‌కు సపర్యలు చేశాడని తిహార్ జైలు అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. పోక్సో చట్టం కింద రింకును జైల్లో పెట్టారు.