• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అయోధ్యలో హనుమాన్‌

    హనుమాన్‌ చిత్ర యూనిట్ రామజన్మభూమి ప్రాంతమైన అయోధ్యలో పర్యటించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించి రాముడి ఆశీర్వచనాలు తీసుకున్నామంటూ చిత్రబృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ఇటీవల విడుదలైన హనుమాన్ టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. A Glimpse into the whirlwind tour of Team #HanuMan to Ayodhya, where they sought the divine blessings of the … Read more

    ‘ఆదిపురుష్‌ కన్నా ‘హను-మాన్‌’ టీజరే బాగుంది’

    యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘హను-మాన్’ చిత్రం టీజర్ విడుదలైంది. అయితే ఈ టీజర్‌ను నెటిజన్లు ఆదిపురుష్‌ టీజర్‌తో పోలుస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఆదిపురుష్‌ కంటే హనుమాన్‌ టీజర్‌ చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. టీజర్‌లో విజువల్స్ అదుర్స్ అని పొగిడేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.

    ‘హనుమాన్’ నుంచి స్పెషల్ పోస్టర్

    యంగ్ హీరో తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ మూవీ నుంచి చిత్రబృందం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తేజ సజ్జ పల్లెటూరి యువకుడి లుక్‌లో కనిపించాడు. ఎడ్లబండి నడుపుతూ స్మైలింగ్ లుక్‌లో అదరగొట్టాడు. ఈ పిక్ చూసిన తేజ అభిమానులు సూపర్, నైస్ లుక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.

    ‘హనుమాన్’ మూవీ నుంచి వినయ్ రాయ్ లుక్ విడుదల

    తేజ సజ్జ హీరోగా, ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మూవీ ‘హనుమాన్’. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి విలన్ ‘మైఖేల్’ పాత్రలో నటిస్తున్న వివేక్ రాయ్ లుక్‌ను స్టార్ హీరో రానా విడుదల చేశారు. డార్క్ థీమ్‌లో ముఖానికి మాస్క్ పెట్టుకొని ఉన్న వివేక్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ టీజర్ మంచి హైప్ సృష్టించగా.. తాజాగా విడుదలైన మూవీ లుక్ కూడా మరింత అంచనాలను పెంచేస్తోంది. Courtesy Twitter: Courtesy … Read more