తెలంగాణలో చలి మొదలైంది
తెలంగాణలో అప్పుడే చలికాలం ప్రారంభమైంది. మొన్నటి వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడు చలికి ఒణికిపోతున్నారు. హన్మకొండలో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.7 డిగ్రీలు తగ్గి 17.3 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్లో 17.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రుతుపవనాల తిరోగమనం, ఉత్తరాది నుంచి చలిగాలులు వీయటం వల్ల పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాత్రి పూట 9 గంటల తర్వాత చలితీవ్రత పెరుగుతోంది.