• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఖుషి’ టైటిల్‌ సాంగ్ వచ్చేసింది

    విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న ‘ఖుషి’ చిత్రం నుంచి టైటిల్‌ సాంగ్ రిలీజైంది. డైరెక్టర్‌ శివ నిర్వాణ లిరిక్స్‌ అందించగా.. సంగీత దర్శకుడు హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ పాటను ఆలపించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. తాజాగా విడుదలైన మూడో పాటకు సైతం నెటిజన్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది.

    ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్; గూస్‌బంప్స్ పక్కా

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ‘‘వీరయ్య.. వీరయ్య’’ టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటికే ఈ పాటను 5 మిలియన్ల మంది వీక్షించారు. ఈ పాటలో బాస్ స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దేవీశ్రీప్రసాద్ స్వరాలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, పవిత్రాచారి ఆలపించారు. ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    వినసొంపుగా ‘లైక్ షేర్ అండ్ సబ్స్‌క్రైబ్’ టైటిల్ సాంగ్

    సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్‌క్రైబ్’. నవంబర్ 4వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి తాజగా టైటిల్ సాంగ్ విడుదలైంది. ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ, సుదర్శన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.

    ‘రంగ‌రంగ వైభంగా’ టైలిట్ సాంగ్ రిలీజ్

    వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్న ‘రంగ‌రంగ వైభ‌వంగా’ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. గిరీశాయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. తాజాగా వచ్చిన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. సినిమా సెప్టెంబ‌ర్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా నేడు తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్న చిత్ర‌బృందం అక్క‌డినుంచి ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టింది.

    ‘రాజ‌మండ్రి రోజ్‌మిల్క్’ టైటిల్ ట్రాక్ విడుద‌ల‌

    జై, అనంతిక జంట‌గా న‌టించ‌న ‘రాజ‌మండ్రి రోజ్‌మిల్క్’ మూవీ నుంచి టైటిల్ ట్రాక్ రిలీజ్ అయింది. అజ‌య్ అర‌సాడ మ్యూజిక్ అందించ‌గా ఈ పాట‌ను అనురాగ్ కుల‌క‌ర్ణి ఆల‌పించాడు. చంద్ర‌బోస్ లిరిక్స్ అందించాడు. వెన్నెల కిశోర్, ప్ర‌వీణ్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఇన్‌ట్రోప్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాని బండిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

    ‘రామారావు ఆన్ డ్యూటీ’ టైటిల్ సాంగ్ రిలీజ్

    ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ టైటిల్ సాంగ్ రిలీజైంది. ఈ ప‌వ‌ర్‌ఫుల్ సాంగ్‌ను ల‌వితా లోబో పాడారు. శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిచాడు. ర‌జిషా, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా న‌టించారు. వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాకు శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రం జులై 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.