• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అధికారి కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

    తెలంగాణలో ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారి చొక్కా కాలర్ పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఓ ప్రభుత్వ అధికారి చొక్కా పట్టుకుని బూతులు తిట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. గురుకుల పాఠశాల నూతన భవన ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యేను పిలవకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీనంతటికీ ఆ అధికారే కారణమని అతని చొక్కా కాలర్ పట్టుకున్నాడు. కాగా ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల్ని వేధిస్తారు.. ప్రభుత్వ అధికారుల గల్లా పట్టుకుంటారు, చేయి చేసుకుంటారు.. ఈ టీఆర్ఎస్‌ … Read more

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. యువకుల దాడి

    టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ యువజన సంఘాలు షాకిచ్చాయి. కాన్వాయ్‌లో వెళ్తుండగా..గన్నేరువరం మండలం గుండపల్లి వద్ద రోడ్డుకు అడ్డంగా యువజన సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని బాలకిషన్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కొందరు యువకులు రాళ్ల దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

    ఎమ్మెల్యేల కొనుగోలుపై ప్రకాశ్‌ రాజ్‌ ఘాటు స్పందన

    తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఘాటుగా స్పందించారు. దిల్లీ నుంచి వచ్చిన సిగ్గులేని బ్రోకర్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ప్రకాశ్‌ రాజ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టినవారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని వేలం వేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై గురువారం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన సీఎం కేసీఆర్…దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని విమర్శించిన విషయం తెలిసిందే.

    వందల కోట్లు ఎక్కడ దాచారు?

    తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని చూశారన్న కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. నిందితుల నుంచి స్వాధీనపరుచుకున్న మొబైల్‌ ఫోన్లలోని డేటాను పరిశీలిస్తున్నారు.మొయినాబాద్‌లోని ఫాం హౌజ్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని పరిశీలిస్తున్నారు. ఫామ్‌ హౌస్‌కు డబ్బు తెచ్చారా? ఒకవేళ తెస్తే ఎక్కడ దాచారు? అనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు. TRSకు చెందిన గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే భారీగా నగదు ఇస్తామని చెప్పారని పోలీసులు వెల్లడించారు.

    ఇవాళ ఉ.11 గంటలకు KCR ప్రెస్‌మీట్‌

    తమను కొంతమంది ప్రలోభ పెట్టారని చెబుతున్న TRS ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రగతి భవన్‌లో ఉన్నారు. రాత్రి వారితో సీఎం కేసీఆర్‌ అనేక విషయాలు చర్చించారు. దీనిపై ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌ పెట్టే అవకాశముంది. మరోవైపు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌కు ఎలా వెళ్లనిస్తారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి స్టేట్‌మెంట్‌ తీసుకోవాల్సింది పోయి ప్రగతి భవన్‌కు ఎలా వెళ్లనిచ్చారని పోలీసులను ప్రశ్నించారు.