తెలుగోడి దెబ్బకు ఎవడైనా తగ్గాల్సిందే; కేంద్ర మంత్రి
తెలుగోడి దెబ్బకు ఎవడైనా దిగి రావాల్సిందేనని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. తమిళనాడులోని తెలుగువాళ్లంగా ఐక్యమత్యంగా ఇక్కడి ప్రభుత్వంపై పోరాడి హక్కులు సాధించుకోవాలని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన తెలుగు వారి ఆత్మీక సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. తమిళనాడులో తెలుగు కనుమరుగయ్యే పరిస్థితిలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు కిషన్రెడ్డి ఇరాన్లో పర్యటించనున్నారు.