• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోనీ న్యూ లుక్; పిక్స్ వైరల్

    భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ న్యూ లుక్ అదిరిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెల్ల గడ్డం, నల్ల జుట్టుతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ట్రెండీగా కనిపిస్తున్నాడు. కాగా ఐపీఎల్ ప్రారంభమవ్వడానికి మరో 2 నెలలు మాత్రమే ఉండడంతో ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. ప్రాక్టీస్‌కు సంబంధిం చిన [వీడియో](url)లు కూడా వైరల్‌గా మారాయి. వచ్చే ఐపీఎల్ ధోనీకి చివరిదని క్రీడా విశ్లేషకులు, అభిమానులు పేర్కొంటున్నారు. MS Dhoni practicing at nets ahead of IPL … Read more

    శుభ్‌మన్‌గిల్ ఓల్డ్ వీడియో; నెట్టింట్లో వైరల్

    న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా యంగ్ సెన్షేషన్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గిల్ చిన్నప్పటి [వీడియో](url) ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2014లో గిల్‌కు 15 ఏళ్లు ఉన్నప్పుడు తన సహచర ఆటగాడు నిర్మల్ సింగ్‌తో కలసి ఓ మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో మొదటి వికెట్‌కు ఇద్దరూ కలసి 587 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ సందర్భంగా గిల్ మీడియాతో మాట్లాడాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా … Read more

    లక్నోలో బైక్‌పై రెచ్చిపోయిన జంట

    బైక్‌పై ఓ జంట మరోసారి రెచ్చిపోయింది. రాత్రిపూట రోడ్డుపై వికృత చేష్టలు చేస్తూ కనిపించారు. స్కూటీ నడుపుతున్న యువకుడిని గట్టిగా హత్తుకుని ఎదురుగా కూర్చుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లక్నోలో జరిగిన ఈ ఘటనలో బైక్‌పై కూర్చున్నది మైనర్ బాలిక అని పోలీసులు వెల్లడించారు. యువకుడు విక్కీ శర్మ(23)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బైక్‌ని సీజ్ చేశారు. యువకుడిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల విశాఖపట్నంలో కూడా సరిగ్గా ఇలాగే ఓ జంట … Read more

    ‘నాటు నాటు’కు రాంచరణ్ అత్త డ్యాన్స్; వీడియో వైరల్

    ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు రాంచరణ్ అత్త శోభన కామినేని కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ [వీడియో](url)ను ఉపాసన షేర్ చేస్తూ ‘‘అల్లుడి ఘనతకు గర్విస్తోన్న అత్త.’’అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో శోభన పాల్గోంది. తాను ఎక్కడికి వెళ్లినా తన అల్లుడు చరణ్ గురించే అందరూ అడుగుతున్నారని.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అంతర్జాతీయ గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని శోభన చెప్పుకొచ్చింది. Very proud mother in law … Read more

    సోఫాసెట్‌తో ప్యారాగ్లైడింగ్.. వీడియో వైరల్

    సాధారణంగా ప్యారాగ్లైడింగ్ చేయడాన్ని మనం చూస్తుంటాం. కానీ, ఓ వ్యక్తి విభిన్నంగా ప్యారాగ్లైడింగ్ చేసి అబ్బుర పరిచాడు. సోఫా సెట్‌కి ఓ టీవీని అమర్చి ప్యారా గ్లైడింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గాలిలోకి ఎగిరాక ఎలాంటి గందరగోళం లేకుండా ఆ వ్యక్తి తీరికగా సోఫా సెట్‌పై కూర్చున్నాడు. బూట్లు మార్చుకున్నాడు. టీవీ ఆన్ చేసి స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేశాడు. కోక్ టిన్ చేతిలో పట్టుకుని ప్యారాగ్లైడింగ్‌ని ఆస్వాదించాడు. అనంతరం క్షేమంగా ల్యాండ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. … Read more

    సుగుణ సుందరి ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా

    స్టార్ హీరోయిన్ శృతిహాసన్ బ్లాక్ శారీలో అద్భుత హావభావాలు ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు శృతిని తెగ పొగిడేస్తున్నారు. ‘సుగుణ సుందరి హాట్ ఎక్స్‌ప్రెషన్స్ అదరహో’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘తన కలల రాజకుమారి’ అంటూ మరొకరు ట్వీటారు. ‘శృతి అందానికే పర్యాయపదం’, ‘టీనేజర్‌లా కనిపిస్తోంది’, చీరలో అదిరిపోయింది’ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan … Read more

    బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన వ్యక్తి; వీడియో వైరల్

    ఓ వ్యక్తి బ్యాడ్మింట్ ఆడుతూనే కుప్పకూలి మరణించాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఈ ఘటన మస్కట్‌లో చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితులతో కలసి కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. చాలా హుషారుగా కోర్టులో అటు ఇటు పరిగెత్తుతూ గేమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో ఆ వ్యక్తి ఉన్నట్లుండి కోర్టులోనే కుప్పకూలిపోయాడు. స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. 2 Jan 2023 : Indian-origin man dies of ? attack? while … Read more

    విజయ్ దేవరకొండ చెడ్డీ రూ.86,712.. అంత ఖరీదా?

    విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక్కో సారి ఒక్కోలా డిఫరెంట్ డ్రెస్‌లు వేసుకుని వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా న్యూఇయర్ వేడుకలకు సంబంధించి ఓ [వీడియో](url) ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో టోపీ పెట్టుకుని.. ఓ ముగ్గుల చెడ్డీ వేసుకుని కనిపించాడు. ఆ చెడ్డీ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. దాని ధర ఏకంగా రూ.86,712గా ఉంది. ఈ అండర్ గార్మెంట్ వెర్సేస్ అనే బ్రాండ్‌కు సంబంధించినది. ఈ బ్రాండ్‌లో చెడ్డీలన్నీ రూ.50 వేలపైనే ఉంటాయి. View … Read more

    పెళ్లయితే.. వరుడికి చుక్కలే..

    ప్రస్తుతం పెళ్లిలో వధూవరులు ఇద్దరూ జిమ్ వర్కౌట్లు చేస్తూ ఉన్న వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. పెళ్లి వేడుకలో వధూవరులిద్దరూ డ్యాన్స్‌తో పాటు పుషప్‌లు తీస్తూ కనిపించారు. వీరు చేసిన డ్యాన్స్, వర్కౌట్లకు అక్కడున్న అతిథులు చప్పట్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వధువు ఇప్పుడే ఇలా ఉందంటే.. పెళ్లయితే వరుడికి చుక్కలే’’ అంటూ నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.

    గడ్డకట్టిన కులూ జలపాతం; పిక్స్ వైరల్

    హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ[ జలపాతం](url) గడ్డ కట్టుకుపోయింది. అతి శీతల వాతావరణంతో గడ్డ కట్టి మంచుతో చెక్కిన శిల్పాలుగా ఆకట్టుకుంటోంది. ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు వెల్లువలా వస్తున్నారు. కాగా హిమాలయాల చెంతనే ఉండటంతో హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. తాగే మంచినీరు కూడా గడ్డ కట్టుకుపోతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. On #Udaipur – #Tindi road… Near Bhim bagh ? 7th January 2023#Lahaul , #HimachalPradesh@SkymetWeather @jnmet @Mpalawat … Read more