• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏనుగు దెబ్బకు ఫుట్‌బాల్‌లా మారిన బైక్

    ఓ ఏనుగుకు కోపం వచ్చి తంతే బైక్ [ఫుట్‌బాల్‌](url)లా ఎగిరిపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఏడాది కింద తీసినట్లు తెలుస్తోంది. కేరళలోని మలప్పురంలో ఏనుగు దారి తప్పి జనావాసాల్లోకి వచ్చింది. గజరాజు కాసేపు జనాలను ఉరుకులు పరుగులు పెట్టించింది. చివరకు నడిరోడ్డుపై ఉన్న ఓ బైక్‌ను ఎగిరి తన్నింది. దీంతో ఆ బైక్ ఫుట్‌బాల్‌లా వెళ్లి అవతల పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను బెంగళూరు ట్రాఫిక్ డీసీపీ కళా కృష్ణస్వామి పోస్ట్ చేశారు. " Don't park … Read more

    ప్రభాస్‌ను రోస్ట్ చేసిన బాలయ్య

    బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్‌కు తనకూ మధ్య ఏం లేదని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పష్టం చేశారు. రాముడు సీతతోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు? అని అన్‌స్టాపబుల్ షోలో ‌బాలయ్య అడిగాడు. ‘‘ అది పాత వార్త. ఆ వార్తల్లో నిజం లేదు. అవన్నీ ప్రచారాలు మాత్రమేనని [మేడమ్](url)(కృతిసనన్) చెప్పింది కదా. మా మధ్య ఏమీ లేకపోయినా అనవసరంగా గోల చేస్తున్నారు.’’ అంటూ డార్లింగ్ చెప్పుకొచ్చారు. కాగా ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేసిన వెంటనే ఫ్యాన్స్ భారీగా ఆహాలోకి ఎంట్రీ ఇవ్వడంతో సైట్ క్రాస్ … Read more

    ఇంటికి కాపలాగా కోబ్రా; వీడియో వైరల్

    ఓ ఇంటికి కోబ్రా కాపలాగా ఉంది. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ నాగుపాము తలుపు సందులోంచి పడగ విప్పి బుస కొడుతోంది. ఈ క్రమంలో తనను వీడియో తీస్తున్న వ్యక్తిని అమాంతం కాటు వేయబోయింది. కాగా ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది తెలియరాలేదు. మన దేశంలోనే జరిగి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘ది బెస్ట్ సేఫెస్ట్ సెక్యూరిటీ సిస్టమ్’ అంటూ కామెంట్లు జోడిస్తున్నారు. Haha we need one of … Read more

    చేతి కన్నా పెద్దదైన అట్లాస్ చిమ్మట!

    మనిషి చేయి కన్న పెద్దగా ఉండే అట్లాస్ చిమ్మట ఒకటి శ్రీలంకలో ప్రత్యక్షమైంది. సీతాకోక చిలుక రూపంలో.. భారీ ఆకారంలో ఉండే ఈ కీటకాలు అరుదుగా ఉంటాయట. రెక్కలపై ఉన్న కోబ్రా డిజైన్‌తో శత్రువులను మభ్య పెట్టి తప్పించుకోగలదట. చైనా, ఇండోనేషియా, మలేషియా, భారత్‌లలో ఇవి ఎక్కువగా ఉంటాయని నేచురల్ హిస్టరీ మ్యూజియం ఒకటి తెలిపింది. అయితే, ఈ వీడియో ఫేక్ అంటూ కొందరు నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. మరికొందరు ఇది గ్రీకులు దైవంగా భావించే ‘అట్లాస్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో … Read more

    అలీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ తెలుసా?

    కమెడియన్ అలీకి ఓ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ షోలో తెలిపారు.‘‘ మా ఇంటి దగ్గర ఓ అమ్మాయి ఉండేది. ఒకరోజు వర్షంలో తడుచుకుంటూ వెళ్తుంటే.. నా గొడుగు ఇచ్చా. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. కానీ మా ప్రేమాయణం అమ్మాయి వాళ్ల అమ్మకు నచ్చలేదు. అందుకే ఆ అమ్మాయితో విడిపోవాల్సి వచ్చింది.’’ అంటూ తన ఫెయిల్యూర్ లవ్‌స్టోరీని చెప్పుకొచ్చాడు. అలీ ప్రస్తుతం ‘అలీతో సరాదాగా’కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఇప్పుడు … Read more

    ఇమ్రాన్ ఖాన్ ఆడియో క్లిప్ వైరల్

    పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ బూతు [ఆడియో](url) క్లిప్‌లు వైరల్‌గా మారాయి. ఓ ఆడియో క్లిప్‌లో ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్నట్లు ఉంది. ఆ మహిళను వ్యక్తిగతంగా కలవాలని కోరుతున్నట్లు ఉంది. సదరు మహిళ బాధల్లో ఉన్నట్లు తెలిపింది. తర్వాతి రోజు కలుసుకోవడంపై వారు మాట్లాడుకున్నారు. ఆ రోజు తన భార్యాపిల్లలు వస్తున్నారని, వారిని ఆలస్యంగా రమ్మంటానని చెబుతాడు. ఏ విషయం మరుసటి రోజు చెబుతానని ఫోన్ పెట్టేస్తాడు. కాగా ఈ ఆడియో క్లిప్ తనకు సంబంధించి కాదని ఇమ్రాన్ కొట్టేశాడు. pakistan's … Read more

    ఏం గుండెరా వాడిది.. పక్కనే చిరుత ఉన్నా హాయిగా..

    ఓ వ్యక్తి కారులోకి హఠాత్తుగా చీతా దూరినా ఆ వ్యక్తి హాయిగా కూర్చున్న [వీడియో](url) వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే..ఓ వ్యక్తి తన కారులో కూర్చుని జంగిల్ సఫారీ ఆస్వాదిస్తుండగా అకస్మాత్తుగా చిరుత వస్తుంది. కారులోకి దూరి అక్కడి వస్తువులను చూస్తూ ఉంటుంది. కానీ కారులోని వ్యక్తి మాత్రం ధైర్యంగా వీడియో రికార్డు చేస్తూనే ఉన్నాడు. పక్కన ఉన్నవారు భయపడుతున్నారు కానీ అతను మాత్రం ఏమాత్రం బెదరలేదు. జీపులోని వ్యక్తి ధైర్యం చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. A man on safari in … Read more

    పెళ్లి మండపంలో ఫైటింగ్; వీడియో వైరల్

    పెళ్లి మండపంలో అతిథులు ఫైటింగ్‌కు దిగారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్లింట్లో వైరల్‌గా మారింది. ఓ వైపు పెళ్లి జరుగుతుండగా అకస్మాత్తుగా అతిథులు గొడవకు దిగారు. వారిలో వారు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పెళ్లి కొడుకు మండపం పైనుంచి దిగుతుండగా అక్కడున్న వారు వారించారు. కొందరు పెద్దలు ఆ గొడవను ఆపాలని చూసినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పెళ్లికి వచ్చారా? గొడవకు వచ్చారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared … Read more

    ‘కాంతారా’ చూసి ఆశ్చర్యపోయా; దర్శకుడు రాజమౌళి

    మొదటిసారిగా[ ‘కాంతారా’ ](url)సినిమా చూసి ఆశ్చర్యపోయానని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. తాము ఇలాంటి చిత్రాన్ని ఎందుకు తీయడం లేదని ప్రశ్నించుకున్నారు. ఈ మూవీ నాలాంటి దర్శకులను ఒత్తిడిలోకి నెట్టేసిందని ప్రశంసించారు. చిత్ర నిర్మాణ ప్రక్రియను పున సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రేక్షకుల పరంగా ఇది ఒక అద్భుత చిత్రమని కొనియాడారు. కలెక్షన్లు రావాలంటే కంటెంట్ ఉండాలని ఈ చిత్రం నిరూపించిందని రాజమౌళి పేర్కొన్నారు. .@ssrajamouli and @PrithviOfficial discussing the magic of #Kantara on the Filmmakers' Adda … Read more

    అది జోక్ మాత్రమే; ‘విమ్’ ట్వీట్

    బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ నటించిన ఓ [యాడ్](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యాడ్‌లో మిలింద్ పురుషుల డిష్ వాష్ క్లీనర్ ‘విమ్ బార్’ను ప్రమోట్ చేస్తాడు. కానీ దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘‘అంటే అంట్లు ఆడవాళ్లే తోమాలా’’ అంటూ ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో యూజర్ ‘‘దయచేసి ఇది ఒక స్పూఫ్ అని చెప్పండి’’ అంటూ రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన విమ్.. ‘ఆ యాడ్ ఒక జోక్ మాత్రమే’ అంటూ ట్వీట్ చేసింది. View … Read more