• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వాషింగ్‌ మెషీన్లలో రూ.1.30 కోట్లు

  AP: విశాఖలో వాషింగ్ మెషీన్లలో తరలిస్తున్న రూ.1.30 కోట్లు హవాలా డబ్బు గుట్టు రట్టయ్యింది. విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా ఎన్‌ఏడీ జంక్షన్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. హవాలా నగదుగా అనుమానిస్తున్న విశాఖ పోలీసులు.. నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు. డబ్బు ఎవరిదానే దానిపై పోసులు ఆరా తీస్తున్నారు. ఓ ప్రముఖ కంపెనీ నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు.

  విశాఖ వన్డేకు వరుణుడి ముప్పు!

  భారత్‌-ఆసీస్‌ మధ్య రేపు విశాఖలో జరగనున్న రెండో వన్డేకు వరణుడి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే విశాఖలో భారీ వర్షం కురవగా రేపటి నుంచి 3 రోజుల పాటు వానలు కురిస్తాయని IMD హెచ్చరించింది. మ్యాచ్‌ జరిగే సమయంలో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం పడే ఛాన్స్‌ ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు రెండో మ్యాచ్‌ కోసం భారత్‌, ఆసీస్‌ ఆటగాళ్లు విశాఖ చేరుకున్నారు. క్రికెటర్లకు నోవాటెల్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు.