• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌!

    వరల్డ్‌కప్‌ తర్వాత ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా కోచ్‌గా V.V.S లక్ష్మణ్‌ వ్యవహిరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కోచ్‌ ద్రవిడ్‌ పదవికాలం వరల్డ్‌కప్‌తో ముగియనుంది. నిబంధనల ప్రకారం చీఫ్‌ కోచ్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది. అయితే తీవ్ర ఒత్తిడితో కూడుకున్న చీఫ్‌ కోచ్‌ పదవికి 51 ఏళ్ల ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్‌ ఆసీస్‌తో సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉన్నట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

    మురళీధరన్ యువతకు స్ఫూర్తి: లక్ష్మణ్

    హైదరాబాద్‌లో ‘800’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా.. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. ‘మురళీధరన్‌ గొప్ప క్రికెటర్‌ అని అందరికీ తెలుసు. కానీ, అంతకంటే గొప్ప మనసున్న వ్యక్తి, ఈ తరం యువతకు రోల్‌ మోడల్, అతనిలాంటి స్నేహితుడు ఉండటం అదృష్టం’ అని చెప్పుకొచ్చారు. మురళీధరన్ బయోపిక్ చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్, ఆయన భార్య మలర్‌గా మహిమా నంబియార్ నటించారు. ఈ చిత్రాన్ని ఎంఎస్ శ్రీపతి డైరెక్ట్ చేశారు. https://x.com/NtvTeluguEnt/status/1706223769973366818?s=20