మీ జీవితానికి మీరే హీరో; పూరీ జగన్నాథ్
వచ్చిన అవకాశాలను వదులుకోకూడదని, మీ జీవితాలకు మీరే హీరో అని డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో యూత్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘యువతలో విపరీతమైన బలం ఉంటుంది. వద్దన్న పనే చేస్తారు. భవిష్యత్‌పై బెంగ ఉండదు. మీలాంటి యువతే మేథావులకు కావాలి. కానీ ధర్నాలు, ఉద్యమాలు అంటూ మిమ్మల్ని కొంతమంది పక్కదోవ పట్టిస్తారు. కానీ మీరు గుర్తించి తిరగాలి. జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు.’’ అంటూ పూరీ పేర్కొన్నారు.