• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్‌’, ‘ది గోట్‌ లైఫ్‌’.. అటు ఓటీటీలో ఏవంటే? 

    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.

    థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు

    ది గోట్‌లైఫ్‌

    పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) హీరోగా, అమలా పాల్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ది గోట్‌లైఫ్‌’. సర్వైవల్‌ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ‘ఆడు జీవితం’ (Aadujeevitham) పేరుతో మార్చి 28న విడుదల కానుంది. దీనికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ‘గోట్‌ డేస్‌’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథాంశమని చిత్ర యూనిట్‌ తెలిపింది. 

    టిల్లు స్క్వేర్‌

    సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. 

    గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌

    మరో విజువల్‌ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ సిద్ధమైంది. ఆడమ్‌ విన్‌గార్డ్‌ దర్శకత్వంలో రూపొందిన  తాజా చిత్రం  ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌’ (Godzilla x Kong: The New Empire) ఈ వారం వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయబోతోంది. ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్‌ ఎలా చెక్‌పెట్టిందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో మార్చి 29న విడుదల కానుంది.

    కలియుగం పట్టణంలో

    విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanam Lo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. 

    ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు

    సుందరం మాస్టర్‌

    వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master OTT Release). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్‌ కానుంది.

    ఏం చేస్తున్నావ్‌?

    విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌?’ (Em chesthunnav OTT Release). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది.

    ట్రూ ల‌వ‌ర్‌

    జై భీమ్‌, గుడ్‌నైట్ సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు కె.మ‌ణికంద‌న్‌ (manikandan). ఆయన నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్‌’ (True Lover OTT Release) ఇటీవల తెలుగులో రిలీజై పాజిటివ్‌ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్‌గా గౌరీ ప్రియ ఆకట్టుకుంది. ప్ర‌భురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ‘ట్రూ ల‌వ‌ర్‌’.. మార్చి 27న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

    మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    https://telugu.yousay.tv/tfidb/ott

    TitleCategoryLanguagePlatformRelease Date
    TestamentSeriesEnglishNetflixMarch 27
    Heart Of The Hunter MovieEnglishNetflixMarch 29
    The Beautiful GameMovieEnglishNetflixMarch 29
    The Great Indian Kapil ShowSeriesHindiNetflixMarch 30
    Tig NotaroSeriesEnglishAmazon primeMarch 26
    The BoxtersSeriesEnglishAmazon primeMarch 28
    Patna ShuklaMovieHindiDisney + HotstarMarch 29
    Renegade NellSeriesEnglishDisney + HotstarMarch 29
    The HoldoversMovieEnglishBook My ShowMarch 29
    A Gentle Man In MaskSeriesEnglishJio CinemaMarch 29
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv