• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    స్వయంకృషితో సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానానికి ఎదగ వచ్చని నిరూపించిన వ్యక్తి ఆయన. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించిన ఆచార్యుడు. కొత్త టాలెంట్ ఉన్న యువకులకు అండగా నిలబడే ‘అన్నయ్య’ ఆయన. కోవిడ్ సమయంలో ఎంతో మందికి సాయం చేసిన ఆపాద్బాంధవుడు. ఆయనెవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి. పద్మవిభూషణుడిగా వెలుగొందుతూ.. భావితరాలకు స్ఫూర్తి నింపుతున్న చిరంజీవిగారి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం..

    చిరంజీవి అసలు పేరు?

    కొణిదెల శివశంకర్ వరప్రసాద్

    చిరంజీవి ఎత్తు ఎంత?

    5 అడుగుల 7 అంగుళాలు

    చిరంజీవి నటించిన తొలి సినిమా?

    ప్రాణం ఖరీదు, (చిరంజీవి నటింటిన తొలి చిత్రం పునాది రాళ్లు అయినా.. ప్రాణం ఖరీదు ముందుగా విడులైంది)

    చిరంజీవి ఎక్కడ పుట్టారు?

    పశ్చిమ గోదావరి, మొగల్తూరు, ఆంధ్రప్రదేశ్

    చిరంజీవి పుట్టిన తేదీ ఎప్పుడు?

    1955 ఆగస్టు 22

    చిరంజీవి భార్య పేరు?

    ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను 1980లో పెళ్లి చేసుకున్నారు.

    చిరంజీవి అభిరుచులు?

    చిరంజీవికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటాడు

    చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎవరు ఇచ్చారు? 

    “సుప్రీమ్‌ హీరో”గా గుర్తింపు పొందిన చిరంజీవి.. తర్వాత మెగాస్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ‘మరణ మృదంగం‘ చిత్రం విజయం తర్వాత ఆ సినిమా నిర్మాత కేఎస్‌ రామారావు, చిరంజీవిని మెగాస్టార్‌గా పిలవడం ప్రారంభించారు.

    చిరంజీవి బ్రేక్ డ్యాన్స్‌ ఏ సినిమాలో ఫస్ట్‌ టైం చేశారు?

    పసివాడి ప్రాణం చిత్రం ద్వారా చిరంజీవి తొలిసారి తెలుగులో బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశారు

    చిరంజీవికి ఇష్టమైన సినిమా?

    రుద్రవీణ

    చిరంజీవికి ఇష్టమైన పాటలు?

    రుద్రవీణ చిత్రంలోని ‘నమ్మకు నమ్మకు ఈ రేయిని’ పాట అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు.

    చిరంజీవి అభిమాన నటుడు?

    అమితాబ్ బచ్చన్, శత్రఘ్ను సిన్హా

    చిరంజీవికి స్టార్ డం అందించిన చిత్రం?

    ఖైదీ

    చిరంజీవికి ఇష్టమైన కలర్?

    బ్లాక్ అండ్ వైట్

    చిరంజీవి తల్లిదండ్రుల పేర్లు?

    కొణిదెల వెంక‌ట్రావ్, అంజనా దేవి 

    చిరంజీవి ఏం చదివారు?

    BCom

    చిరంజీవి ఎన్ని సినిమాల్లో నటించారు?

    150కి పైగా సినిమాల్లో నటించారు

    చిరంజీవికి ఇష్టమైన ఆహారం?

    బొమ్మడాయిల పులుసు, చిన్న చిన్న చెపల్లో చింతకాయ వేసి వండితే ఇష్టంగా తింటారు.

    చిరంజీవి నికర ఆస్తుల విలువ ఎంత?

    రూ.3000కోట్లు

    చిరంజీవి సినిమాకి ఎంత తీసుకుంటారు?

     ఒక్కో సినిమాకి దాదాపు రూ.70కోట్లు తీసుకుంటారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv