• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood Cult  Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే! 

    ఒకప్పుడు టాలీవుడ్‌ అంటే దేశంలోని సినీ ఇండస్ట్రీలలో ఒకటిగా ఉండేది. తెలుగు సినిమాలంటే నార్త్‌ ఇండియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మన డైరెక్టర్లు కూడా కేవలం సరిహద్దులు గీసుకొని కేవలం తెలుగు ఆడియన్స్‌ కోసమే సినిమా రిలీజ్‌ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జాతీయ అవార్డు ఫంక్షన్లకు ఆహ్వానం లభించని స్టేజీ నుంచి ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనే స్థాయికి మన డైరెక్టర్లు ఎదిగారు. అంతర్జాతీయ బహుమతులను దేశానికి అందిస్తూ ప్రతీ ఒక్కరినీ గర్వపడేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే 1990 నుంచి ఇవాళ్టి దసరా వరకూ ఎన్నో కల్ట్‌ సినిమాలు టాలీవుడ్‌ గతిని మార్చాయి. తెలుగు ఇండస్ట్రీని రేంజ్‌ను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నాయి.

    కల్ట్ మూవీ అంటే?

    కల్ట్ మూవీకి పర్యాయ పదంగా ట్రెండ్ సెట్టర్ సినిమా అని కూడా సినీ విశ్లేషకులు పిలుస్తారు. విభిన్న కథాంశం. విడుదలయ్యాక ఆ మూవీ పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ సంపాదించడం, ఆ చిత్రం పంథాను కొన్నేళ్లపాటు మరికొన్ని సినిమాలు అనుసరించి రావడం, ఆ సినిమా డైలాగ్స్.. ఇప్పటికీ జనాల నాలుకలపై నానడం వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలు ఈ కోవలోకే వస్తాయి.

    90వ దశకం నుంచి యాక్షన్ కల్ట్ మూవీలు

    శివ(1989)

    ఎలాంటి అంచనాలు లేకుండా 1989లో రిలీజైన ‘శివ’ మూవీ ఇండస్ట్రీ కల్ట్ గా నిలిచింది. అప్పటి వరకు సామాజిక ఆర్థిక అంశాలే ప్రధానం రూపొందిన చిత్రాల పంథాను ఒక్కసారిగా మార్చింది. పక్క యాక్షన్ మూవీగా తెరకెక్కిన శివ నాగార్జునకు స్టార్ డామ్ తెచ్చిపెట్టింది. ఆయన కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. నాగార్జున పట్ల యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సైకిల్ చైన్ లాగే మెనరిజాన్ని అప్పట్లో యూత్ పిచ్చిగా ఫాలో అయ్యేవారు. ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మతో మూవీలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కట్టారు. అంతే కాదు శివ యాక్షన్ సిక్వెన్స్‌ను అనుసరిస్తూ చాలా చిత్రాలు వచ్చాయి.

    గాయం(1993)

    1993లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లోనే  వచ్చిన ‘గాయం’ సైతం మంచి యాక్షన్ కల్ట్‌ గా నిలిచింది. ఈ మూవీని యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పెరొందిన జగపతి బాబు ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ లుక్ లోకి మారిపోయారు. దుర్గ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. జగపతి బాబు సరసన రేవతి, కోటా శ్రీనివాస్ రావు, సిరివెన్నెల సితారామశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని’ అనే పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిందే.

    భారతీయుడు(1996)

    శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన భారతీయుడు ఆల్ టైమ్ యాక్షన్ కల్ట్ చిత్రంగా పేరొందింది. రొటీన్ మూవీలకు భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా సరికొత్త కథాంశంతో శంకర్ తెరకెక్కించాడు. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ తర్వాత ఇదే తరహా కథాంశాలతో వచ్చిన రమణ, ఠాగూర్, మల్లన్న చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో మెప్పించాడు. మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించాడు.

    సమరసింహా రెడ్డి(1999)

    నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన ‘సమరసింహా రెడ్డి(1999), నరసింహా నాయుడు(2001) యాక్షన్ ఎంటర్ టైన్మెంట్‌కు కొత్త నిర్వచనం అందించాయి. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రాల్ని డెరెక్టర్ బీ గోపాల్ అద్భుతంగా తెరకెక్కించాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్  బాగా పేలాయి. ఈ చిత్రాల్లో బాలయ్య డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసింది. ఈ రెండు సినిమాలను అనుకరిస్తూ వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. ఫాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఇంద్ర, ఆది, యజ్ఞం మూవీలు హిట్ కొట్టాయి.

    పోకిరి(2006)

    తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ కల్ట్ మూవీ పోకిరి(2006). అప్పటివరకు తెలుగు తెరకు పరిచయం లేని గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ తో పూరి ముందుకొచ్చాడు. పోకిరి దెబ్బకు అన్ని రికార్డులు దాసోహం అయ్యాయి. హీరో మేనరిజం, డెలాగ్స్, చిత్రీకరణ విలువలు, మణిశర్మ మ్యూజిక్  ప్రతి ఒక్కటీ వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు పోకిరి యాక్షన్ సిక్వెన్స్ ను ఫాలో అయ్యాయి.   

    మగధీర(2009)

    రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర క్లాసిక్ కల్ట్ గా చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను మగధీర బ్రేక్ చేసింది. పూర్వ జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ చాల ఏళ్ల తర్వాత మళ్లీ పౌరాణిక వాసనను తెలుగు తెరకు గుర్తు చేసింది. కత్తులు, యుద్ధం వంటి యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మంచి బ్రెక్ ఇచ్చింది. నటించిన రెండో సినిమాతోనే చరణ్ కు స్టార్ హోదా దక్కింది. ఈ చిత్రం పోలికలతో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఆశించినంత విజయం సాధించలేదు.  

    అర్జున్ రెడ్డి(2017)

    కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి డెరెక్ట్ చేసిన ‘అర్జున్ రెడ్డి(2017)’ టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం పెద్దఎ త్తున ఫ్యాన్ బేస్ సంపాదించింది.  విజయ్ దేవరకొండ కేరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాను హిందీ, తమిళ్ ఇండస్ట్రీల్లో రీమేక్ చేశారు. యూత్ లో ఫుల్ జోష్ ను నింపింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ ని రౌడీ బాయ్ అంటూ అభిమానులు పిలవడం మొదలు పెట్టారు.

    బాహుబలి-2(2017)

    రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కావ్యం ‘బాహుబలి-2(2017)’ భారత చలనచిత్ర గతినే మార్చింది. అన్ని భాషలను ఏకం చేసి పాన్ ఇండియా ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లోనే సాధ్యమనుకునే  భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ రికార్డును బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులే కాదు సౌత్ సినిమాలను పెద్దగా ఆదరించని నార్త్ ఆడియన్స్ మనసులను సైతం కొల్లగొట్టింది.

    సౌత్, నార్త్ కాదు మన సినిమా ఇండియన్ సినిమా అనే స్థాయికి ఇండస్ట్రీ వర్గాలను తీసుకొచ్చింది. ఈ మూవీ తర్వాత పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా మూవీలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

    రంగస్థలం (2018)

    ఒకేరకమైన కథలతో వెళ్తున్న టాలీవుడ్‌కు రంగస్థలం సినిమా కొత్త మార్గాన్ని చూపించింది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పక్కా పల్లెటూరు కథతోనూ హిట్‌ కొట్టొచ్చని డైరెక్టర్ సుకుమార్‌ ఈ తరం దర్శకులకు చూపించారు. ఇందులో రామ్‌ చరణ్, సమంత నటన మూవీకే హైలెట్‌ అని చెప్పాలి. రామ్‌చరణ్‌లోని కొత్త నటుడ్ని ఈ సినిమా ఆవిష్కరించింది. ఈ సినిమా స్ఫూర్తితో ప్రస్తుతం చాలా మంది దర్శకులు పల్లెటూరి కథలో దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో షేక్‌ చేస్తున్న దసరా, బలగం సినిమాలకు ఈ సినిమానే స్ఫూర్తి అని చెప్పొచ్చు. 

    పుష్ప(2022)

    పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘పుష్ప’ భారీ విజయాన్ని సాధించింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ  అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా డైలాగులను రాజకీయ నాయకులు మొదలు క్రికెటర్లు, WWE స్టార్ల వరకు వల్లవేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అయితే.. రాజకీయ నాయకులు ‘తగ్గేదేలే’.. ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది.

    ఆర్‌ఆర్‌ఆర్‌ (2022)

    దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేశాడు. టాలీవుడ్‌ శక్తి సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ అవార్డును సాధించింది. తద్వారా భారతీయుల హృదయాలను ఉప్పొంగేలా చేసింది. ఒకప్పుడు జాతీయ అవార్డులు రావడమే గగనంగా ఉన్న పరిస్థితి నుంచి తెలుగు సినిమా ఆస్కార్‌ స్థాయికి ఎదిగింది. కథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్‌టీఆర్‌లు కూడా RRRలో ఎంతో అద్భుతంగా నటించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. 

    బలగం (2023)

    సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయిన ఘనవిజయం సాధిస్తుందని బలగం సినిమా నిరూపించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ప్రభంజనే సృష్టించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రేమానురాగాలను డైరెక్టర్‌ వేణు చక్కగా చూపించాడు. పక్కా పల్లెటూరు నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. 

    దసరా (2023)

    టాలీవుడ్‌ రేంజ్‌ను దసరా చిత్రం మరింత పెంచింది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల మార్క్‌ అందుకున్నాడు. ఈ సినిమా కూడా పల్లెటూరు కథాంశంతో తెరకెక్కి పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ముఖ్యంగా హీరో నాని ఈ సినిమా తన నటా విశ్వరూపమే చూపించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఊరమాస్‌గా ఇరగదీశాడు. హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. మహానటి తర్వాత కీర్తి అత్యుత్తమ నటనను ఈ సినిమాలో చూడొచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv