‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అయితే రెండో పాత్రకు జోడీగా గుజరాతీ నటి శ్రుతి మరాఠే (Shruti Marathe) నటిస్తోంది.
దేవరలో నటించే విషయాన్ని శ్రుతినే స్వయంగా ప్రకటించడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భామ గురించి తెలుసుకునేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
గుజరాత్‌లోని వడోదరా ప్రాంతంలో 9 అక్టోబర్, 1986 శ్రుతీ జన్మించింది. అక్కడి సెయింట్ మీరాస్ కాలేజీ (St. Mira’s College)లో ఆమె చదువుకుంది.
కెరీర్ ప్రారంభంలో శ్రుతి మరాఠే మోడల్‌గా చేసింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి గుర్తింపు పొందింది.
అలా మరాఠీ సీరియల్స్‌లోకి అడుగుపెట్టిన శ్రుతి.. రాధ హయ్ బవారి (Radha Hi Bawari), జాగో మోహన్ ప్యారే (Jaago Mohan Pyare), మఝ్యా నవర్యాచి బేకూ (Majhya Navaryachi Bayko) వంటి సీరియళ్లతో చాలా పాపులర్ అయ్యింది.
2008లో వచ్చిన ‘సనాయ్ చౌగదే’ (Sanai Choughade) అనే మరాఠీ సినిమాతో ఆమె వెండితెరపై అడుగుపెట్టింది. అందులో అశ్విని పాత్రలో కనిపించి అలరించింది.
ఆ తర్వాత ‘ఇందిరా విఝా’ (Indira Vizha) సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టి అక్కడ కూడా గుర్తింపు సంపాదించింది. మరాఠి, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది.
2016లో వచ్చిన బుధియా సింగ్ – బొర్న్ టూ రన్’ (Budhia Singh – Born to Run) సినిమాతో శ్రుతి.. బాలీవుడ్‌కు పరిచయమైంది. అదే ఏడాది ‘వెడ్డింగ్ యానివర్సరీ’తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది.
‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ (Bard Of Blood) వెబ్‌సిరీస్‌లోనూ శ్రుతి నటించింది. బాలీవుడ్లో తనేంటో నిరూపించుకున్న శ్రుతికి టాలీవుడ్లో ‘దేవర’నే మెుదటి సినిమా.
శ్రుతి మరాఠే వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమెకు 2016లోనే వివాహమైంది. ప్రముఖ మరాఠీ నటుడు గౌరవ్ ఘట్నేకర్ (Gaurav Ghatnekar) ఆమె వివాహం చేసుకుంది.
విహార యాత్రలను ఎక్కువగా ఇష్టపడే ఈ భామకు బోటింగ్ అంటే ఇంకా ఇష్టమట. షూటింగ్ నుంచి ఏ కాస్త విరామం దొరికినా కుటుంబంతో ట్రిప్ ప్లాన్ చేస్తుందట.
ఈ సోషల్ మీడియాలోనూ శ్రుతి మరాఠీ చాలా చురుగ్గా ఉంటోంది. ఇంట్లో వాళ్లతో కలిసి చేసిన రీల్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
శ్రుతి.. అప్పుడప్పుడు గ్లామర్ ఫొటోలను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!