రామయాణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్లో మరో సినిమా రాబోతోంది. దర్శకుడు నితేశ్ తివారీ (Nitesh Tiwari) ‘రామాయణం’ (Ramayanam)పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా నటించనున్నారు. రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ (Yash) కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ బాలీవుడ్లో తెగ వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) భాగం కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.
ఆ బాధ్యత అప్పగింత!
లేటెస్ట్ బజ్ ప్రకారం… రామాయణ తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas)కు మేకర్స్ అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు సైతం ఉంది. ఈ విషయం పలు చిత్రాల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. దీంతో రామాయణ చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదించినట్లు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలుగు వెర్షన్‌కు మాటలు అందించాల్సిందిగా కోరినట్లు పేర్కొంటున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి వస్తుందని అంటున్నారు.
బన్నీ చేతుల్లో త్రివిక్రమ్ భవితవ్యం!
ఈ ఏడాదిలో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)తో ప్రేక్షకులను మెప్పించిన త్రివిక్రమ్ తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అల్లు అర్జున్‌తో ఓ సినిమా ఉంటుందని గతంలోనే ఆయన చెప్పారు. అయితే బన్నీ’పుష్ప 2′తో ఫుల్ బిజీగా ఉండటం.. దాని తర్వాత అట్లీతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే రామాయణ టీమ్‌లోకి త్రివిక్రమ్ చేరడం ఖాయమని చెప్పవచ్చు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే ఛాన్స్ వుంది.
‘ఆదిపురుష్’లా జరగకూడదు!
ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాల్లోని డైలాగ్స్‌పై హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆదిపురుష్ తెలుగు వెర్షన్ చూసిన వారు కూడా సంభాషణలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘రాయయణం’ టీమ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి తప్పిదం పునరావృతం కాకుండా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే త్రివిక్రమ్‌ను డైలాగ్స్ అందించాల్సిందిగా మేకర్స్ కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు త్రివిక్రమ్ ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!