క్రిస్మస్ కానుకగా ఈ వారం నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యాయి. హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ డిస్నీ (Disney) నిర్మించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ శుక్రవారం (డిసెంబర్ 20) గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘యూఐ’ విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. వీటితో పాటు తెలుగులో అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి, తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన ‘విడుదల 2’ కూడా రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మరి ఈ చిత్రాల తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ పరంగా ఏ సినిమా టాప్‌లో ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం.
‘ముఫాసా’ డే 1 కలెక్షన్స్..
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) లైవ్ యానిమేషన్ చిత్రంగా రూపొందింది. ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు సూపర్ స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పాడు. మహేష్ వాయిస్ ఓవర్‌తో పంచ్‌లు, ప్రాసలు అదిరిపోయాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇండియాలో తొలి రోజు కలెక్షన్స్ విషయాన్ని వస్తే ఈ చిత్రం రూ.10 కోట్ల గ్రాస్ (Mufasa: The Lion King Day 1 Collections) సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఇంగ్లీషు వెర్షన్లో రూ.4 కోట్లు, హిందీలో రూ.3 కోట్లు, తెలుగులో రూ.2 కోట్లు, తమిళంలో రూ.కోటి గ్రాస్ తన ఖాతాలో వేసుకుందని పేర్కొన్నాయి. శని, ఆదివారాల్లో ఈ మూవీ కలెక్షన్స్ అమాంతం పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. క్రిస్మస్ సెలవులు కూడా ఉండటంతో మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాయి. కాగా, తొలి వీకెండ్లో ‘ముఫాసా’ వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 180 మిలియన్ డాలర్లు (రూ.1529 కోట్లు) వసూలు చేస్తుందని హాలీవుడ్ వర్గాలు అంచనా వేశాయి.
‘యూఐ’ కలెక్షన్స్ ఎంతంటే
ఉపేంద్ర (Upendra) హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్ థ్రిల్లర్ ‘యూఐ’ (UI) శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం కనెక్ట్ అయితే పక్కా ఎంటర్టైన్ చేస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తొలి రోజు ఈ చిత్రం రూ.Rs 6.75 కోట్ల గ్రాస్ (UI Movie Day 1 Collections) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క కర్ణాటకలోనే రూ.6 కోట్లు తన ఖాతాలో వేసుకుందని పేర్కొన్నాయి. తెలుగు బాక్సాఫీస్ వద్ద రూ.70 లక్షలు, తమిళంలో రూ.4 లక్షలు, హిందీ రీజియన్‌లో రూ.లక్ష వసూలు చేసినట్లు తెలిపాయి. యూత్‌లో ఈ సినిమా పెద్ద ఎత్తున అటెన్షన్ రావడంతో వీకెండ్లో ‘యూఐ’ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి.
‘విడుదల 2’ కలెక్షన్స్..
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ రూపొందించిన ‘విడుదల 2’ (Vidudala 2) చిత్రం డిసెంబర్ 20న రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ సేతుపతి నటన, వ్యవస్థల లోపాలను దర్శకుడు ఎత్తిచూపిన విధానం బాగుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.9 కోట్ల గ్రాస్ (Vidudala 2 Movie Day 1 Collections) సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.8 కోట్లు వసూలైనట్లు తెలిపాయి. తెలుగులో రూ.60 లక్షల వరకూ కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.3.5 కోట్లు వచ్చి చేరాయని వివరించాయి. మూవీకి వచ్చిన టాక్‌ను బట్టి కలెక్షన్స్ పెరగడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
‘బచ్చల మల్లి’ వసూళ్లు..
అల్లరి నరేష్ (Allari Naresh) మాస్ రోల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే అల్లరి నరేష్ మాస్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇదిలా ఉంటే తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.80 లక్షల (Bachchala Malli Day 1 Collections) వరకూ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.60 లక్షల వరకూ ఉండొచ్చని చెప్పాయి. యావరేజ్ టాక్ నేపథ్యంలో వీకెండ్స్‌లో ఈ సినిమా ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాయి.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్