రేసుగుర్రం సినిమా చూసిన వారు మద్దాలి శివారెడ్డి పాత్రను మర్చిపోలేరు. నటుడు రవికిషన్ ఈ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రస్తుతం ఆయన గోరఖ్‌పూర్ ఎంపీ కూడా. అయితే, నటి నగ్మాతో అఫైర్‌పై తాజాగా స్పందించాడీ బీజేపీ ఎంపీ. ‘నగ్మా, నేను కలిసి ఎన్నో సినిమాలు చేశాం. అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సహజంగానే మా మధ్య మంచి స్నేహం ఉంటుంది. దాన్ని కొంతమంది అపార్థం చేసుకునేవారు. ఇప్పటికీ మా మధ్య బంధం అలాగే ఉంది. మిగతావన్నీ రూమర్లే’ అంటూ రవికిషన్ క్లారిటీ ఇచ్చారు. నగ్మా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కావడం గమనార్హం.
భోజ్‌పురి ఇండస్ట్రీలో నగ్మా, రవికిషన్ జంటకు చాలా మంచి పేరు ఉంది. వారు ఇరువురు హీరో, హీరోయిన్లుగా చేసిన సినిమాలు అక్కడ సూపర్ హిట్‌గా నిలిచాయి. పండిట్ జీ బతాయి న బియహ్ కబ్ హోయి, గంగా, అబ్ తా బంజా సజన్వా హమార్, తు హమార్ హావ్ సినిమాల్లో రవికిషన్, నగ్మా నటన ఆకట్టుకుంటుంది. ఆ సినిమాల్లో వీరి కెమెస్ట్రీ చాలా బాగా కుదిరిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కాగా, ప్రస్తుతం రవికిషన్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన యూపీలోని గోరక్‌పూర్ స్థానం నుంచి గెలుపొందారు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!