Amazon Prime 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’ టూ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. అమెజాన్‌లో రిలీజయ్యే టాప్‌ మూవీస్‌ ఇవే! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon Prime 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’ టూ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. అమెజాన్‌లో రిలీజయ్యే టాప్‌ మూవీస్‌ ఇవే! 

    Amazon Prime 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’ టూ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. అమెజాన్‌లో రిలీజయ్యే టాప్‌ మూవీస్‌ ఇవే! 

    April 3, 2024

    సాధారణంగా సినిమా విడుదల తర్వాత ఆ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్‌ వేదిక ఖరారవుతుంది. కానీ, ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ మాత్రం ఈ విషయంలో మిగిలిన వాటి కంటే ఎంతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇంకా షూటింగ్‌ దశలోనే ఉన్న టాలీవుడ్‌ అగ్ర హీరోల చిత్రాలను సైతం విడుదలకు ముందే తన ఖాతాలో వేసుకుంటోంది. ఆయా సినిమా పోస్ట్‌ థియేట్రికల్‌ ఓటీటీ హక్కులను ముందుగానే తన పేరిట రిజర్వ్‌ చేసుకుంటోంది. ఇలా అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కు కన్ఫార్మ్‌ అయిన టాలీవుడ్‌ బడా చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu)

    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), డైరెక్టర్‌ క్రిష్‌ (Krish) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్‌ దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. పవన్‌.. ఏపీ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్‌ పెట్టడంతో ఎన్నికల తర్వాత మిగిలిన షూటింగ్‌లో ఆయన పాల్గొంటారు.

    గేమ్‌ ఛేంజర్‌ (Game Changer)

    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan).. లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా అమెజాన్‌ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని గతంలో అమెజాన్‌ స్వయంగా పోస్టర్‌ రూపంలో వెల్లడించింది. అంతేకాదు మూవీకి సంబంధించిన ప్లాట్‌ను సైతం రివీల్‌ చేసి వార్తల్లో నిలిచింది. కాగా, డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ ఖరారు కానుంది.

    ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh)

    ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’. పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా అమెజాన్‌ను స్ట్రీమింగ్‌ వేదికగా ఫిక్స్ చేసింది. కాగా ఇటీవల విడుదలైన ఉస్తాద్‌ భగత్‌ సింగ్ టీజర్‌ తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్‌ను క్రియేట్‌ చేసుకుంది. ముఖ్యంగా గాజు గురించి పవన్‌ చెప్పిన డైలాగ్‌ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

    ఫ్యామిలీ స్టార్‌ (Family Star)

    విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’.. థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత అమెజాన్‌లోనే స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ భారీ ధరకు దక్కించుకున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 5న వరల్డ్‌ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. 

    ఓం భీమ్‌ బుష్‌ (Om Bheem Bush)

    శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా హాస్య నటులు ప్రియదర్శి (Priyadarsi), రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్‌ దక్కించుకుంది. ఏప్రిల్‌ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానుంది. మార్చి 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డు వసూళ్లను రాబట్టింది. 

    తమ్ముడు (Thammudu)

    స్టార్‌ హీరో నితిన్‌ (Nithiin) అప్‌కమింగ్‌ చిత్రం ‘తమ్ముడు’ స్ట్రీమింగ్ హక్కులను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నితిన్ చేస్తోన్న మూడో సినిమా ‘తమ్ముడు’. 

    ఘాతీ (GHAATI)

    స్టార్‌ హీరోయిన్‌ అనుష్క (Anusha Shetty) అప్‌కమింగ్‌ మూవీ ‘ఘాతీ’ కూడా ప్రైమ్‌లోనే ఓటీటీలోకి రానుంది. దీనికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో స్వీటీ వేశ్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పరిస్థితుల కారణంగా ఒక రొచ్చులో ఇరుక్కున్న మహిళ.. తన సాధికారతను నిరూపించుకోవడం కోసం ఎలా పోరాడింది’ అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుంది.

    కాంతారా 2 (Kantara 2)

    రిషబ్‌ శెట్టి (Rishab Shetty) హీరోగా ఆయన స్వీయదర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ చిత్రం.. దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కూడా రూపొందుతోంది. ఇది షూటింగ్‌ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను సైతం అమెజాన్‌ దక్కించుకోవడం విశేషం. 

    కంగువా (Kanguva)

    2024లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ ఒకటి. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన దిషా పటానీ (Disha Patani) హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కూడా థియేటర్లలో విడుదల అనంతరం అమెజాన్‌లోనే స్ట్రీమింగ్‌లోకి రానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version