చాలా గ్యాప్ తర్వాత రాజ్‌తరుణ్ నటించిన మూవీ ‘అనుభవించు రాజా’. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించడం..నాగచైతన్య, నాగార్జున మూవీని ప్రమోట్ చేయడంతో అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంది ఇంతకీ స్టోరీ ఏంటి తెలుసుకుందాం
రాజ్ వాళ్ల తాత సంపాదించడంలో పడి లైఫ్‌ను ఎంజాయ్ చేయడం మానేస్తాడు. దీంతో ఆయన చనిపోయేటప్పుడు మనవడికి..నాలాగా కాకుండా ఉన్నదంతా అనుభవించు..లైఫ్‌ని ఎంజాయ్ చేయమని చెప్పాడు. దీంతో తాత మాటను చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. కట్‌చేస్తే.. అంత రాయల్‌గా బతకాల్సిన వాడు ఒకేసారి సెక్యూరిటీ గార్డ్‌గా కనిపించడం ఆసక్తిని రేపుతుంది. అసలు ఊర్లో అన్ని ఆస్తులు వదులుకొని సెక్యూరిటీగా ఎందుకు పనిచేస్తాడు తర్వాత స్టోరీ ఏంటి తెరపై చూడాలి
రాజ్ (రాజ్‌తరుణ్) హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటాడు. అక్కడ ఐటీ ఉద్యోగి శృతి (కాశిశ్ ఖాన్)ని చూసి ఇష్టపడతాడు. కొన్ని రోజుల్లో ఇద్దరికీ పరిచయం పెరిగి ప్రేమలో పడతారు. ఇలా ఫస్టాఫ్ స్టోరీ కొంచెం కామెడి.. కొంచెం లవ్‌స్టోరితో నడిపంచేశాడు దర్శకుడు శ్రీను గవిరెడ్డి. సెకండాఫ్ వచ్చేసరికి గ్రామీణ నేపథ్యం, కోడి పందాలు, పేకాటలు, ప్రెసిడెంట్‌గా పోటీచేసేందుకు రాజు చేసే ప్లాన్స్ ఇలా వీటన్నింటితో సాగుతుంది.
అనుభవించు రాజా.. రాజ్ తరుణ్ ఎనర్జిటక్‌గా కనిపించాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో తన నటనను కనబరిచాడు. ఇక హీరోయిన్ పాత్ర మొదటిభాగంలో అలరించినప్పటికీ సెకండాఫ్‌లో పరిమితంగా ఉంది. ఇక కమెడియన్ సుదర్శన్ హీరో ఫ్రెండ్ పాత్రలో నవ్వించే ప్రయత్నం చేశాడు. బిగ్‌బాస్ ఫేమ్ అరియానా, రవికృష్ణ , అజయ్, ఆదర్శ్ బాలకృష్ణ వారి పాత్రల మేరకు నటించారు.
స్టోరీ మొత్తం అనుకున్నట్లుగానే సాగుతుండటంతో కొత్తదనం ఏమి కనిపించదు. కథ బాగానే ఉన్నప్పటికీ కథనం మెప్పించలేదు. అయితే రాజ్‌తరుణ్ అనగానే.. ఎక్స్‌పెక్ట్ చేసేంత కామిడీ అయితే లేదు. పాటలు బాగున్నాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్..క్లైమాక్స్ సీన్స్ కొంత ఆసక్తిని పెంచుతాయి.
రేటింగ్ 2.5/5
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ