• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దక్షిణాఫ్రికా ఓటమి.. కెప్టెన్‌పై విమర్శలు

    వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడింది. అప్పటి వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన సౌతాఫ్రికా సెమీస్ కీలకమైన నాకౌట్ పోరులో మాత్రం చేతులెత్తేసింది. అయితే సెమీస్‌లో సౌతాఫ్రికా ఓటమికి ఆ జట్టు కెప్టెన్ టెంబా బవూమానే కారణమని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బ్యాటింగ్‌లో విఫలం, కెప్టెన్సీలో ప్రభావం చూపలేకపోతున్నాడని విమర్శలు చేస్తున్నాయి. దీంతో జట్టుకు భారమయ్యాడని విమర్శిస్తున్నారు.

    AUS vs SA: దక్షిణాఫ్రికా స్వల్ప స్కోరు

    వరల్డ్‌కప్‌ రెండో సెమీస్‌లో ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 212-10 (49.4) స్వల్ప స్కోరు చేసింది. ఓ దశలో 24-4 (11.5) స్కోరుతో ఉన్న దక్షిణాఫ్రికాను క్లాసెన్‌ (47), మిల్లర్‌ (101) జోడీ కాపాడింది. వీరిద్దరు 90కి పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్లాసెన్‌ ఔటైన తర్వాత మిల్లర్‌ మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. అద్భుతమైన శతకంతో చివరి వరకూ పోరాడాడు. జట్టు స్కోరును 200 మార్క్‌ను దాటించాడు. మిల్లర్ వల్లే SA ఆమాత్రం స్కోరైన చేయగల్గింది. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 3, కమ్మిన్స్‌ 3, హేజిల్‌వుడ్‌ … Read more

    టాస్‌ గెలిచి సౌతాఫ్రికా బ్యాటింగ్

    వన్డే వరల్డ్‌కప్‌ భాగంగా నేడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌-2లో తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట సౌతాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్‌), టెంబా బవుమా(కెప్టెన్‌), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా జట్టు: ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్‌, గ్లెన్ … Read more

    50 సెంచరీలు.. కోహ్లీపై సినీ ప్రముఖుల ప్రశంసలు

    న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక 50 శతకాలు నమోదు చేసి కోహ్లీ, సచిన్‌ తెందూల్కర్‌ రికార్డును అధిగమించాడు. దీనిపై సినీ ప్రముఖులు స్పందిస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు. అగ్ర దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్‌, సాయిధరమ్‌ తేజ్‌, వెంకటేష్‌లతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు ట్వీట్ చేస్తూ కోహ్లీని ప్రశంసించాయి.

    ఆ సమయంలో నా కెంతో బాధేసింది: షమీ

    కేన్ విలియమ్సన్ క్యాచ్ డ్రాప్‌పై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో కీలకమైన కేన్‌ విలియమ్సన్ క్యాచ్‌ను మిస్‌ చేశానని చెప్పాడు. ఆ సమయంలో తనకెంతో బాధేసిందన్నాడు. ‘దీంతో బౌలింగ్‌లో నా వంతు కోసం ఎదురు చూశా. కివీస్‌ బ్యాటర్లు దూకుడుగా షాట్లు ఆడేస్తున్నారు. పిచ్‌ కూడా చాలా బాగుంది. కానీ, తేమ ప్రభావం వస్తుందేమోనని కంగారు పడ్డాం. ఇలాంటి సమయంలో స్లో వేసే బంతులు కూడా ప్రభావం చూపకపోవచ్చు అందుకే, నేను శైలిలోనే బంతులను సంధించా’. అని షమీ చెప్పుకొచ్చాడు.

    కెప్టెన్సీకి బాబర్‌ గుడ్‌బై

    పాకిస్థాన్‌ జట్టు కెప్టెన్నీకి బాబర్ అజామ్ గుడ్‌బై చెప్పాడు. వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెస్టు జట్టుకు షాన్‌ మసూద్‌ను, టీ20లకు షహీన్‌ షా అఫ్రిదిని కెప్టెన్లుగా పీసీబీ నియమించింది. అయితే ప్రపంచకప్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన పాక్ ఐదు మ్యాచ్‌లు ఓడి సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

    నేడు దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా ఢీ

    నేడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మరో సెమీస్‌ జరుగుతోంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్‌ను ఢీ కొడుతుంది. ప్రపంచకప్‌లో జోరు కొనసాగిస్తూ టీమిండియా ఇప్పటికే ఫైనల్‌‌కు చేరింది. మరి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచి రోహిత్‌ సేనకు ఢీకొననుంది ఎవరో నేడు తేలిపోనుంది.

    నేడు భారత్-న్యూజిలాండ్ మ్యాచ్

    వన్డే వరల్డ్ కప్ భాగంగా నేడు న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. వాంఖడే స్టేడియం వేదికగా ఈ హైహోల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. 2019 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమి పాలైన టీమిండియాకు నాలుగేళ్ల తర్వాత న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ దక్కింది. తొలి సెమీ ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా మరో గెలుపు కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

    ‘వీళ్లకంటే రోహిత్‌ ప్రత్యేకం’

    టీమిండియా సారథి రోహిత్‌ శర్మపై మాజీ క్రికెటర్లు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. పాక్‌ దిగ్గజాలు వసీమ్‌ అక్రమ్‌, షోయబ్‌ మాలిక్‌ కూడా హిట్‌మ్యాన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ‘ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్‌ శర్మ వారందరికంటే ప్రత్యేకం. ఏ బౌలర్నీ అతడు వదిలిపెట్టలేదు. ప్రత్యర్థి ఎవరైనా కానీ.. ఎలాంటి బౌలింగ్‌ దాడైనా కానీ.. వారిని దీటుగా ఎదుర్కొంటూ చాలా తేలికగా పరుగులు రాబడతాడు’. అని పాక్ క్రికెటర్లు కొనియాడారు.

    భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 టికెట్ల విక్రయాలు

    భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. విశాఖలో ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 23న ఆసీస్ భారత్‌తో తలపడనుంది. ఈనేపథ్యంలో 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఉదయం 11 గంటల టికెట్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రూ.600, రూ.1500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000 ధరల్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.