• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Vamshhi Krrishna: ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాదిన ఆంధ్ర క్రికెటర్.. ఎలా కొట్టాడంటే..!

  ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో జరుగుతున్న కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ (Col CK Nayudu Trophy)లో ఆంధ్రా బ్యాటర్‌ వంశీ కృష్ణ(Vamshhi Krrishna) విధ్వంసం సృష్టించాడు. రైల్వే జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాది ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. రైల్వే జట్టు బౌలర్‌ దమన్‌దీప్‌ సింగ్‌ వేసిన ఓవర్‌లో ప్రతీ బంతిని సిక్స్‌గా మలిచిన వంశీ కృష్ణ.. ఆ ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 64 బంతుల్లో 110 రన్స్‌తో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. … Read more

  రంజీ గెలిస్తే ఆటగాళ్లకు BMW కార్లు: HCA

  రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టుపై HCA అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ జట్టుకు రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. దీంతో పాటు రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే టీంకు రూ.కోటి, ప్రతి ప్లేయర్‌కు బీఎండబ్ల్యూ కారు బహుకరిస్తామని వెల్లడించారు. ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కెప్టెన్‌ తిలక్‌వర్మ, ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌, స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌, ఫైనల్లో సెంచరీలు సాధించిన నితిశ్‌ రెడ్డి, ప్రజ్ఞయ్‌ రెడ్డికి తలో రూ.50 వేలు ప్రత్యేక నగదు … Read more

  ముంబై వదిలి ఆర్సీబీకి బుమ్రా?

  టీమిండియా బౌలర్ బుమ్రా ముంబై ఇండియన్స్‌ను వీడనున్నాడనే ఊహాగానాలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ కలకలం రేపింది. ‘కొన్నిసార్లు మౌనంగా ఉండడమే సరైన జవాబు’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో బుమ్రా పోస్ట్‌ పెట్టాడు. దీంతో అతడు ముంబై వదిలి ఆర్సీబీకి వెళ్లిపోయే అవకాశముందని కొందరు అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభం (2015) నుంచి బుమ్రా, ముంబై ఇండియన్స్‌తో ఉన్నాడు.

  టాస్ ఓడిన భారత్.. టీం ఇదే!

  మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా… భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. జట్ల వివరాలు ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(w/c), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్ భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ.

  మిచెల్‌ మార్ష్‌పై భారత్‌లో కేసు

  ఆసీస్‌ ఆటగాడు మిచెల్‌ మార్ష్‌పై భారత్‌లో కేసు నమోదైంది. వన్డే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టిన మార్ష్‌ చిక్కుల్లో పడ్డాడు. ఉత్తర్‌ ప్రదేశ్‌ అలీగఢ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వరల్డ్‌ కప్‌పై కాళ్లు పెట్టి ఇలా ఆ ట్రోఫీని అవమానించడంతోపాటు 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను గాయపరిచినట్లు కేశవ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  కోహ్లీకి మూడో ర్యాంకు

  ప్రపంచకప్‌లో సత్తాచాటిన కోహ్లి, భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వన్డేల్లో తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లి (791 పాయింట్లు) మూడు, రోహిత్‌ (769) నాలుగో స్థానాల్లో నిలిచారు. శుబ్‌మన్‌ గిల్‌ (826) నం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. బాబర్‌ ఆజాం రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌లో మహ్మద్‌ సిరాజ్‌ 3, జస్‌ప్రీత్‌ బుమ్రా 4, కుల్‌దీప్‌ యాదవ్‌ 6, మహ్మద్‌ షమి 10 స్థానాల్లో ఉన్నారు.

  నేడు ఆసీస్‌తో భారత్ తొలి టీ20

  నేడు ఆసీస్‌తో భారత్ విశాఖలో తొలి టీ20 మ్యాచ్ అడనుంది. పంచకప్‌లోని భారత్‌ జట్టులో ఉన్న వాళ్లలో.. ఇప్పుడు సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ మాత్రమే ఈ సిరీస్‌ ఆడబోతున్నారు. ఇంకో ఆరు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ ఉంది. ఈ సిరీస్‌లో సత్తాచాటాలని ఆటగాళ్లు చూస్తున్నారు. ఈ టీ20లో భారత జట్టులో ఇషాన్‌ (వికెట్‌కీపర్‌), యశస్వి, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, రింకు సింగ్‌, అక్షర్‌/సుందర్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌/అవేష్‌, ముకేశ్‌ ఉన్నారు.

  టీ20లకు రోహిత్ పూర్తిగా దూరం?

  గత ఏడాది నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు దూరంగా ఉంటున్నాడు. అప్పట్నుంచి హార్దిక్‌ పాండ్య సారథ్యంలోనే జట్టు ఆడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది T20 ప్రపంచకప్‌ ఉంది. ఈ క్రమంలో రోహిత్‌ ఈ దశలో తిరిగి టీ20 జట్టులోకి రావాలని, కుర్రాళ్ల అవకాశాలకు అడ్డంకిగా మారాలని అనుకోవట్లేదని బీసీసీఐ వర్గాల సమాచారం. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో రోహిత్ చర్చించిన అనంతరం తాను టీ20లకు దూరంగా ఉండాలని రోహిత్‌ నిర్ణయించుకున్నాడని సమాచారం.

  ఆసీస్‌తో టీ20లకు కెప్టెన్‌గా సూర్య

  ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు జట్లును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేష్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌. పేర్లను వెల్లడించింది.

  ‘జట్టును గెలిపించడం రోహిత్‌కు తెలుసు’

  భారత్, ఆసీస్‌ రేపు టైటిల్‌ పోరులో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్‌ శర్మపై టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్ జహీర్‌ఖాన్ ప్రశంసలు కురిపించాడు. అతడు అద్భుతమైన నాయకుడని కొనియాడారు. ‘అతడు బ్యాటింగ్‌లోనూ దూకుడు చూపిస్తున్నాడు. మంచి స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు. ఎన్నోసార్లు ఫైనల్‌ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం రోహిత్‌కు ఉంది. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి బాగా తెలుసు’. అని జహీర్ చెప్పుకొచ్చాడు.