• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Priyanka Jawalkar: చీరకట్టులో దాగున్న వయ్యారాలతో కవ్విస్తున్న ప్రియాంక జవాల్కర్‌

    టాలీవుడ్‌లో అచ్చమైన తెలుగు అందం ప్రియాంక జవాల్కర్. సంప్రదాయబద్ధంగా ఉంటూనే తన హాట్ లుక్స్‌తో మెప్పిస్తూనే ఉంటుంది ఈ హీరోయిన్‌.  గత కొన్ని నెలలుగా సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక పెట్టే పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అంత అందమైన ఫొటోలు పెడుతుంది మరి.  ప్రస్తుతం చీరకట్టులో దాగున్న సొగసులతో కనువిందు చేస్తోంది ఈ అనంతపురం చిన్నది. నడుము వయ్యారాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది.  కలవరమాయే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక. ఆ తర్వాత 2018లో టాక్సీ వాలా సినిమాలో విజయ్ దేవరకొండతో ఛాన్స్‌ కొట్టేసింది. … Read more

    హైదరాబాద్‌లో వడగళ్ల వాన

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడివ వర్షం పడింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్‌నుమ, నారాయణగూడ, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం, జగద్గిరిగుట్ట, గండిమైసమ్మ, సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యారడైజ్ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది.

    హైదరాబాద్‌లో కుండపోత వర్షం

    హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌తో పాటు ముసాపేట్‌, కేపీహెచ్‌బీ, మియాపూర్‌లో కుండపోతగా వాన పడుతోంది. రోడ్లపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    కవితపై తప్పుగా మాట్లాడ లేదు: బండి

    టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.BRS ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కవిత విషయంలో తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తనెవరినీ కించపరచలేదని వెల్లడించారు. తెలంగాణలో వాడుకలో ఉన్న సామెతను మాత్రమే తాను ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు. కాగా పేపర్ లీకేజీ కేసులో నిందుతురాలు రేణుక కుటుంబ సభ్యులు BRS నేతలేనని బండి సంజయ్‌ ఆరోపించారు. పేపర్‌ లీక్‌ కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

    పేపర్ లీకేజీపై కేటీఆర్ ప్రెస్‌మీట్

    LIVE: పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. పేపర్ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్‌కి నివేదిక అందించామని కేటీఆర్ వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమమైన కమిషన్లలో టీఎస్‌పీఎస్సీ ఒకటని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. యూపీఎస్సీ ఛైర్మన్, 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్లు టీఎస్‌పీఎస్సీని సందర్శించారని వెల్లడించారు. గత ఎనిమిదేళ్లలో అత్యధిక నియామకాలు జరిపిన కమిషన్ టీఎస్‌పీఎస్సీ అని కొనియాడారు.

    దుమారం రేపిన పేపర్ లీక్ ఘటన

    TS: TSPSC పేపర్ల లీక్ ఘటన రాష్ట్రంలో దుమారం రేపింది. వివిధ పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పేపర్ లీగ్ ఘటనపై బీజేపీ, బీఎస్పీ పార్టీ నేతలు గవర్నర్‌ను కలిశారు. రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులు రాజీనామా చేయాలని, మంత్రి కేటీఆర్‌ని బర్తరఫ్ చేయాలని … Read more

    హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

    హైదరాబాద్ శాస్త్రీపురంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున ప్లాస్టిక్ గోదాం నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్కనే ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు విద్యార్థులను అధికారులు ఖాళీ చేయించారు. రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. పెద్దఎత్తున వ్యాపించిన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

    గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ సహా నాలుగు పరీక్షలు రద్దు… నిందితులకు కస్టడీ

    తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తోంది. ఈ క్రమంలో వివిధ పరీక్షలను రద్దు చేయటంతో పాటు కొన్నింటిని వాయిదా వేస్తూ TSPSC నిర్ణయం తీసుకుంది. కొద్ది నెలల క్రితం నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ పరీక్షతో పాటు AEE, డీఏఓ ఎగ్జామ్స్‌ను రద్దు చేశారు. జూనియర్ లెక్చరర్స్‌ సహా మరికొన్నింటిని వాయిదా వేశారు.  రద్దుకే మెుగ్గు టాన్‌ ప్లానింగ్ ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, AEE ప్రశ్నాపత్రాలు లీకైనట్లు గుర్తించిన టీఎస్‌పీఎస్సీ…  సిట్‌ సమర్పించిన నివేదికపై క్షుణ్ణంగా చర్చించింది. వివిధ అంశాలను … Read more

    Hyderabad Rains: కశ్మీరులా మారిన హైదరాబాద్ శివారు.. వీడియోలు నెట్టింట్లో హల్‌చల్

    తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి వడగళ్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్‌, మాసబ్‌ట్యాంక్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, నిజాంపేట, ఎస్‌ఆర్ నగర్, ఎల్బీనగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.  హైదరాబాద్‌లో తెల్లవారుజామున వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. పెద్దఎత్తున నష్టం కలిగించింది. మంచు గడ్డల రూపంలో పెద్దఎత్తున రాళ్ల వర్షం కురిసింది. ప్రజలు బయటకు రావాలంటే వణికిపోయారు. వడగండ్లకు భారీ వరదలు తోడవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  … Read more

    దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌ మీద వాహనం నిలుపుతున్నారా?…. తస్మాత్‌ జాగ్రత్త !

    ఎండాకాలం వేళ.. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుంటే…హైదరాబాద్‌ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌ మీదుగా వెళ్తున్నప్పుడు… స్వచ్ఛమైన గాలి తగిలేసరికి…  బండి అలా ఒక్కసారి పక్కన ఆపి… ఒకే ఒక్క సెల్ఫీ దిగితే ఏది ఏమైనా ఆ కిక్కే వేరు కదా..!  కానీ, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటే మీ జేబులు ఖాళీ అవుతాయి. ఎందుకంటే ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. ముక్కుపిండి రూ. 2 వేలు వసూలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.  కేబుల్ బ్రిడ్జ్‌ ఐకానిక్‌గా నిలవటంతో పాటు చుట్టు … Read more