హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌తో పాటు ముసాపేట్, కేపీహెచ్‌బీ, మియాపూర్‌లో కుండపోతగా వాన పడుతోంది. రోడ్లపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.