• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్‌లో భారీ వర్షం

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బాచుపల్లి, మూసాపేట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కేపీహెచ్‌బీ వద్ద రహదారిపై నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.

    చెన్నైని ముంచెత్తిన వర్షం

    తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షం ముంచెత్తింది. చెన్నైతోపాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. చైన్నైలోని మీనంబాక్కంలో అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. వాహనాలు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. చెన్నై నుంచి బయల్దేరాల్సిన 12కుపైగా అంతర్జాతీయ విమనాలు ఆలస్యంగా నడవనున్నాయి. #WATCH | Tamil Nadu | Chennai … Read more

    హైదరాబాద్‌లో వడగళ్ల వాన

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడివ వర్షం పడింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్‌నుమ, నారాయణగూడ, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం, జగద్గిరిగుట్ట, గండిమైసమ్మ, సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యారడైజ్ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది.

    హైదరాబాద్‌లో కుండపోత వర్షం

    హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌తో పాటు ముసాపేట్‌, కేపీహెచ్‌బీ, మియాపూర్‌లో కుండపోతగా వాన పడుతోంది. రోడ్లపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    ఇండియా- సౌతాఫ్రికా మ్యాచ్ అనుమానమే!

    లక్నోలో జరగనున్న ఇండియా-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ నిర్వాహణ అనుమానంగా ఉంది. ఇప్పటికే రెండు సార్లు టాస్ వాయిదా వేశారు. ఔట్ ఫీల్డ్ పిచ్ పరిశీలించిన అంపైర్లు మరికొద్దిసేపట్లో మ్యాచ్ నిర్వాహణపై నిర్ణయం తీసుకోనున్నారు. మ.1.30గం.లకే టాస్ వేసి 2గంటలకు మ్యాచ్ స్టార్ట్ కావాల్సి ఉంది. [వర్షం ](url)తగ్గకపోవడంతో మ్యాచ్‌ నిర్వహాణపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు మ్యాచ్ నిర్వహణపై త్వరలోనే పూర్తి సమాచారం ఇస్తామని బీసీసీఐ ట్వీట్ చేసింది. Update ? Rain has gotten heavier here in Lucknow and the toss … Read more