• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌ మీద వాహనం నిలుపుతున్నారా?…. తస్మాత్‌ జాగ్రత్త !

    ఎండాకాలం వేళ.. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుంటే…హైదరాబాద్‌ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌ మీదుగా వెళ్తున్నప్పుడు… స్వచ్ఛమైన గాలి తగిలేసరికి…  బండి అలా ఒక్కసారి పక్కన ఆపి… ఒకే ఒక్క సెల్ఫీ దిగితే ఏది ఏమైనా ఆ కిక్కే వేరు కదా..!  కానీ, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటే మీ జేబులు ఖాళీ అవుతాయి. ఎందుకంటే ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. ముక్కుపిండి రూ. 2 వేలు వసూలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

    కేబుల్ బ్రిడ్జ్‌ ఐకానిక్‌గా నిలవటంతో పాటు చుట్టు పక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో…చాలామంది ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డుపై ఆపి ఫోటోలు దిగుతున్నారు. దీనివల్ల అత్యధిక భాగం పార్కింగ్‌కు పోయి.. మిగతా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీన్ని గుర్తించిన పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. 

    ఇప్పటివరకు అక్కడ వాహనాలు నిలిపితే కేవలం రూ.200 జరిమానా విధించేవారు. ఇప్పుడు ఆ ఫైన్‌ను ఏకంగా 10 రేట్లు పెంచారు. రూ. 2000లు కట్టాల్సి వస్తుందని చెప్పారు. అంతేకాదు, వాహనాదారులను కంట కనిపెట్టేందుకు గస్తీ కూడా పెంచుతున్నారు పోలీసులు. పెట్రోలింగ్ వాహనాలు పెంచి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి జరిమానాలు విధించనున్నారు. 

    గతంలో కొంతమంది ఆంక్షలు మీరినప్పుడు హెచ్చరించడం కోసం సైరన్‌లు ఏర్పాటు చేశారు. ఎవరైనా వాహనాలు నిలిపితే మోగించేవారు. ఇది అందర్ని కట్టడి చేయలేకపోతుంది. ఆ తర్వాత సీసీ కెమెరాలు బిగించి నిరంతరం పర్యవేక్షణ పెట్టారు పోలీసులు. బండ్లు ఆపగానే వాటి నంబర్‌ ప్లేట్లను స్కాన్ చేసి చలాన్లు పంచారు. అయినా పరిస్థితి మారకపోవటంతో కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. 

    ఇక నుంచి కేబుల్ బ్రిడ్జ్‌ మీద వాహనాలు నిలిపి ఫోటోలు దిగాలంటే జేబులో లేదా అకౌంట్‌లో రూ.2000 లు ఉన్నాయో లేదో చూసుకోండి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv