• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘రంగమార్తాండ’ ప్రీమియర్స్‌కి మంచి రెస్పాన్స్

    క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రంగమార్తండ’ సినిమా ప్రీమియర్స్‌కి మంచి స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీమియర్స్‌ని ప్రదర్శించారు. సినీ ప్రముఖులు హాజరై చిత్రాన్ని తిలకించారు. సినిమా బాగుందని, ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేయగలదని చెప్పారు. ఇదివరకే విడుదలైన పోస్టర్, పాటలు ఆకట్టుకున్నాయి. శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠా మూవీ ‘నటసామ్రాట్’కి రీమేక్‌ ఇది. 2017లో నక్షత్రం అనే సినిమా తర్వాత రంగమార్తాండ చిత్రాన్ని తెరకెక్కించాడు … Read more

    ‘దసరా’ ట్రైలర్‌ వచ్చేసింది

    నాని, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన దసరా ట్రైలర్‌ వచ్చేసింది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తుండగా… తాజాగా మాస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

    SSMB 29: మహేష్ బాబు సినిమాతో రాజమౌళి మళ్లీ ఆస్కార్ గెలవనున్నాడా?.. ఫ్యాన్స్‌లో భారీగా హైప్!

    RRR చిత్రానికి ఆస్కార్ రావటంతో రాజమౌళి తెరకెక్కించబోయే తదుపరి చిత్రంపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే మహేశ్‌ బాబు హీరోగా ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ కావటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. RRRను మించి చిత్రం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి క్రేజ్ పెరగటంతో ఇప్పుడు పాన్ వరల్డ్‌ను మెప్పించే సినిమాను తీయక తప్పని పరిస్థితి ఏర్పడింది. SSMB29 ట్రెండింగ్ RRR ఆస్కార్ అవార్డు అందుకోవటంతో ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు సినిమా గురించి ట్రెండ్ చేస్తుంటే… మహేశ్‌ ఫ్యాన్స్‌ కూడా … Read more

    MARCH 17 | ఈ వారం థియేటర్లు/ఓటీటీలో విడుదలయ్యే తెలుగు చిత్రాలు

    గతవారం పూర్తిగా చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. ఈ సారి ప్రేక్షకులను అలరించేందుకు భారీ సినిమాలు వస్తున్నాయి. కేజీఎఫ్‌ రేంజ్ ట్రైలర్‌తో ఆకట్టుకున్న కబ్జ(Kabzaa) థియేటర్లలో సందడి చేయనుంది. అవసరాల శ్రీనివాస్‌, నాగ శౌర్య కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రాబోతుంది. భారీ చిత్రాలు ఓటీటీ వేదికగా సందడి చేయనున్నాయి.  మల్టీస్టారర్ కబ్జ ఇండియన్‌ రియల్ స్టార్‌ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, పునిత్ శివరాజ్‌ కుమార్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం కబ్జ. టీజర్ విడుదలైనప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ రేంజ్‌లో … Read more

    లెజెండ్‌ శరవణన్‌ నయా లుక్‌

    శరవణ స్టోర్స్‌ అధినేత లెజెండ్‌ శరవణన్‌.. సినిమాలపై ఆసక్తితో గతేడాది ‘లెజెండ్‌’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. మరోవైపు అనేక మంది శరవణన్‌పై ట్రోల్స్‌ కూడా చేశారు. అయితే శరవణన్‌ ప్రస్తుతం లుక్‌ మార్చారు. నయా లుక్‌తో ఫోటోలు పోస్ట్ చేశారు. త్వరలోనే వివరాలు చెబుతానంటూ మరో సినిమాకు సంబంధించి హింట్‌ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించడం కోసం కొన్ని చోట్లు ఉచితంగా టికెట్లు పంపిణీ చేశారు. సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ … Read more

    ట్రెండింగ్‌లో ‘దసరా’ సాంగ్స్

    న్యాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘దసరా’ సినిమా సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇండియాలోని టాప్ 20 ట్రెండింగ్ సాంగ్స్‌లో ఈ మూవీ పాటలు చోటు దక్కించుకున్నాయి. ‘ధూమ్‌ధామ్ దోస్తాన్’, ‘చమ్కీల అంగీలేసి’, ‘ఓరి వారి’ పాటలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. రూ.65 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీని మార్చి 30న విడుదల చేయనున్నారు.

    RRR | OSCARS: ‘నాటు నాటు’ను ఏళ్ల తరబడి స్మరించుకుంటాం’.. ప్రధాని మోదీ

    RRR చిత్రంలో నాటునాటు పాటకి ఆస్కార్  రావటం పట్ల చిత్రబృందానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజమౌళి టీమ్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందలు తెలుపుతున్నారు. ప్రపంచస్థాయికి భారతీయ సినిమా వెళ్లిందంటూ ప్రశంసిస్తున్నారు.  దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు చరణ్, ఎన్టీఆర్‌లపై పొగడ్తల వర్షం కురుస్తుంది.  RRR చిత్రబృందం ఆస్కార్‌ అందుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.  “ నాటునాటు పాటకి ఆస్కార్‌తో దేశం గర్విస్తోంది. ఈ పాటను కొన్ని ఏళ్లతరబడి స్మరించుకుంటారు. నాటునాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది. కీరవాణి, చంద్రబోస్‌కు … Read more

    The Elephant Whisperers: ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’కి ఆస్కార్ అవార్డు.. భరతభూమికి అంకితం ఇచ్చిన డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్

    ws_FrEZOeuXsAA8LF0

    ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ భారతీయ సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించింది. భారత్ నుంచి ఆస్కార్ అవార్డు గెలుపొందిన తొలి డాక్యుమెంటరీ లఘు చిత్రం ఇదే కావడం విశేషం. 95వ ఆస్కార్ మహోత్సవంలో ఇతర భాషల లఘుచిత్రాలతో పోటీ పడి ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది.  భరతభూమికి అంకితం.. 95వ ఆస్కార్ వేడుకలకు హాజరైన డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్ వేదికపై అవార్డును అందుకున్నారు. … Read more

    దాస్‌ కా ధమ్‌ కీ ట్రైలర్ అదుర్స్

    విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న దాస్‌కా ధమ్‌కీ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యింది. సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కరీంనగర్‌లో నిర్వహించారు. విశ్వక్‌ సేన్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో నివేథా పేథురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

    బస్సు కట్టుకొని బలగం సినిమాకు ప్రేక్షకులు

    [VIDEO:](url) కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన బలగం మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలలో స్ట్రాంగ్ రన్‌ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా పల్లెటూరు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా నిజామాబాద్‌లో సినిమా చూసేందుకు దారిపల్లి గ్రామస్థులు స్పేషల్‌గా బస్సు వేసుకోని మరి వచ్చారు. ఈ వీడియోను ప్రియదర్శి ట్వీట్ చేశారు. నిన్న బలగం సినిమాను చూసిన చిరంజీవి డైరెక్టర్ వేణును అభినందించిన విషయం తెలిసిందే. If this is not Love then what is? The people of #Daripally … Read more