క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రంగమార్తండ’ సినిమా ప్రీమియర్స్‌కి మంచి స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీమియర్స్‌ని ప్రదర్శించారు. సినీ ప్రముఖులు హాజరై చిత్రాన్ని తిలకించారు. సినిమా బాగుందని, ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేయగలదని చెప్పారు. ఇదివరకే విడుదలైన పోస్టర్, పాటలు ఆకట్టుకున్నాయి. శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠా మూవీ ‘నటసామ్రాట్’కి రీమేక్ ఇది.
2017లో నక్షత్రం అనే సినిమా తర్వాత రంగమార్తాండ చిత్రాన్ని తెరకెక్కించాడు కృష్ణ వంశీ. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ రీమేక్‌ను రూపొందించాడు. సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయ రాజా పాటలు అందించడం, ఇప్పటికే మంచి ఆదరణ లభించడంతో హైప్ క్రియేట్ అవుతుంది.
మరాఠీ చిత్రం నట సామ్రాట్‌లో బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ నటించాడు. రంగస్థల నాటకుడు పేరుగాంచిన హీరో ఎన్నో నాటకాలు వేసి అవార్డులు సంపాదిస్తాడు. కాలక్రమేణ వివిధ కారణాల వల్ల నాటకానికి దూరమయ్యి కుటుంబం కోసం కృషి చేస్తాడు. ఏదైనా ముక్కుసూటిగా చెప్పే మనస్తత్వం ఉన్న అతడికి.. కుమారుడు, కోడలుతో విబేధాలు వస్తాయి. కోడలు ఇంటి నుంచి వెళ్లిపోయే వరకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతందనే భావోద్వేగాల నడుమ కథ జరుగుతుంది.
కుటుంబ విలువల గురించి చెప్పే సినిమాలను కృష్ణ వంశీ అద్భుతంగా తెరకెక్కిస్తాడు. నిన్నే పెళ్లాడతా వంటి రొమాంటిక్ చిత్రంలోనూ ఈ పాయింట్‌ని చెప్పిన ఘనత ఈ దర్శకుడిది. మురారి, రాఖీ, చందమామ, గోవిందుడి అందరివాడేలే వంటి సినిమాలు ఇందుకు నిదర్శనం. అందుకే కృష్ణవంశీ ఎమోషన్స్ బాగా పండించగలడనే పేరుంది. ఇప్పుడు రంగమార్తండ కూడా ఈ కోవకే వస్తుండటం విశేషం.
గత కొన్నేళ్లుగా కృష్ణ వంశీకి మంచి హిట్ లేదు. రామ్ చరణ్‌తో తీసిన గోవిందుడు అందరివాడేలే సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. నక్షత్రం అట్టర్ ఫ్లాప్ అనే టాక్‌ను మూటగట్టుకుంది. ఇలాంటి తరుణంలో రంగ మార్తాండ వంటి రీమేక్ కథను ఎత్తుకున్న కృష్ణవంశీకి విజయం దక్కుతుందో లేదో చూడాలి.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’