• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమోషనల్‌గా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

    ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘రంగమార్తాండ’ మార్చి 22న థియేటర్లలో విడుదల కాబోతోంది.ఈ సందర్భంగా చిత్రబృందం సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. బ్రహ్మానందంను మునుపెన్నడూ చూడని రీతిలో ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. ఆద్యంతం ఎమోషనల్‌గా తీర్చిదిద్దిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

    ఆ సీన్‌ షూట్‌ చేస్తుంటే కన్నీళ్లు ఆగలేదు: కృష్ణవంశీ

    ‘రంగమార్తాండ’ చిత్రం షూటింగ్‌కు సంబంధించి డైరెక్టర్‌ కృషవంశీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా లాస్ట్‌ చాప్టర్‌లో రమ్యకృష్ణను షూట్‌ చేయడానికి చచ్చిపోయాననుకో!. దాదాపు 36 గం.పాటు షూటింగ్‌ జరిగింది. తనను ఆ సీన్‌లో చిత్రీకరించడానికి సెంటిమెంట్‌ అడ్డొచ్చింది. కళ్ల వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ రాత్రి నేను సరిగా నిద్రపోలేదు. గుండె రాయి చేసుకుని షూటింగ్‌ చేశా’ అని కంటతడి పెట్టుకున్నారు. కాగా ఈ చిత్రం మార్చి 22న విడుదల కానుంది.

    ‘రంగమార్తాండ’ ప్రీమియర్స్‌కి మంచి రెస్పాన్స్

    క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రంగమార్తండ’ సినిమా ప్రీమియర్స్‌కి మంచి స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీమియర్స్‌ని ప్రదర్శించారు. సినీ ప్రముఖులు హాజరై చిత్రాన్ని తిలకించారు. సినిమా బాగుందని, ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేయగలదని చెప్పారు. ఇదివరకే విడుదలైన పోస్టర్, పాటలు ఆకట్టుకున్నాయి. శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠా మూవీ ‘నటసామ్రాట్’కి రీమేక్‌ ఇది. 2017లో నక్షత్రం అనే సినిమా తర్వాత రంగమార్తాండ చిత్రాన్ని తెరకెక్కించాడు … Read more

    భావోద్వేగంగా ‘బ్రహ్మానందం’ గ్లింప్స్

    క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రంగమార్తండ’ సినిమా నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలైంది. ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే బ్రహ్మి.. ఈసారి తెరపై ఎమోషనల్‌గా కనిపించారు. భక్తి, బాధ, పశ్చాత్తాపం కలగలిపి భావోద్వేగపూరితమైన డైలాగ్‌తో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేశారు. రంగస్థల నటుల జీవితం ఆధారంగా మరాఠీలో తెరకెక్కిన ‘నటసామ్రాట్’ సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు.

    ‘నేనొక నటుడ్ని’ షాయరీ విడుదల

    క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తండ’. ఈ సినిమా నుంచి ‘నేనొక నటుడ్ని’ అనే షాయరీని చిత్రబృందం విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ షాయరీకి తన గొంతుతో ప్రాణం పోశారు. ఓ నటుడి ప్రస్థానాన్ని, అంతరంగాన్ని ప్రేక్షకుడి గుండెకు హుత్తుకునేలా ఉద్వేగభరితంగా ఈ కవిత ద్వారా వర్ణించారు. రంగస్థల నటీనటుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఇళయరాజా స్వరాలు అందించారు.