• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • BRSలో ప్రకాశ్ రాజ్‌కు కీలక బాధ్యతలు

  నటుడు ప్రకాశ్ రాజ్‌కి భారత రాష్ట్ర సమితి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. కర్ణాటక లేదా తమిళనాడు రాష్ట్రాలకు ఆయన బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. మరోవైపు, బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కిందటి సారి ప్రకాశ్ రాజ్ ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి కన్నడ మాజీ సీఎం కుమారస్వామితో పాటు ప్రకాశ్ రాజ్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. దీంతో ఈ … Read more

  మోదీపై ప్రకాశ్‌ రాజ్‌ తీవ్ర వ్యాఖ్యలు

  సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉండే ప్రకాశ్‌ రాజ్‌ ట్విట్టర్‌ వేదికగా బీజేేపీపై గట్టిగానే విమర్శలు గుప్పిస్తుంటాడు. తన రాజకీయ దృక్పథం వల్ల సినిమా అవకాశాలు కూడా తగ్గుతున్నాయని ఇటీవల అన్నాడు. అయితే తాజాగా మోదీపై ప్రకాశ్‌ రాజ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వివిధ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లే మోదీ అక్కడి సంప్రదాయానికి తగ్గట్టుగా వేషధారణ ధరించడం చూస్తుంటాం. దీనిపై ప్రకాశ్‌ రాజ్‌ స్పందిస్తూ…’ఓవర్‌ డ్రెస్సింగ్‌…ఇప్పు కొత్త నగ్నత్వం’ అంటూ ట్వీట్ చేశాడు.

  అక్షయ్‌ కుమార్‌పై ప్రకాశ్‌ రాజ్‌ ఆగ్రహం

  బాలివుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌పై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తీవ్రంగా స్పందించారు. నటి రిచా చడ్డా ఇటీవల సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీనిపై అక్షయ్‌ కుమార్‌ స్పందిస్తూ ‘ఇలాంటివి చూడటం బాధగా ఉంది. ఆర్మీ ఉంది కాబట్టే ఇవాళ మనం ఉన్నాం’ అని ట్వీట్ చేశారు. అక్షయ్‌ స్పందనతో విభేదించిన ప్రకాశ్ రాజ్‌.. మీ నుంచి ఇది ఊహించలేదు అక్షయ్‌. మీకన్నా రిచానే ఈ దేశ ఆర్మీతో దగ్గరి సంబంధం కలిగి … Read more

  రాజకీయాలతో సినిమాలు రావట్లేదు:ప్రకాశ్ రాజ్

  రాజకీయాల ప్రభావం తన సినిమా అవకాశాలపై పడుతోందని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. కొందరు తనతో పనిచేయటానికి ఆసక్తి చూపడం లేదన్నారు. తనతో చేయటం ఇష్టం లేక కాదని..ప్రజలు నన్ను అనుమతిస్తారో లేదో అనే భయంతో అవకాశాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీనివల్ల తాను బాధపడం లేదని వెల్లడించారు. “ప్రస్తుతం ఎవరు ఏంటి అని నాకు తెలుసు. నేను నా గొంతు వినిపించకపోతే ఒక మంచి నటుడిగా చనిపోతాను. కానీ, నాకు నేనులా కాదు” అని అన్నాడు.

  ఎమ్మెల్యేల కొనుగోలుపై ప్రకాశ్‌ రాజ్‌ ఘాటు స్పందన

  తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఘాటుగా స్పందించారు. దిల్లీ నుంచి వచ్చిన సిగ్గులేని బ్రోకర్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ప్రకాశ్‌ రాజ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టినవారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని వేలం వేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై గురువారం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన సీఎం కేసీఆర్…దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని విమర్శించిన విషయం తెలిసిందే.

  కేసీఆర్ విజన్ ఉన్న నేత: ప్రకాశ్ రాజ్

  తెలంగాణ సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నేత అని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశంసించారు. తెలంగాణ అంటే ఆయనకు ఎంత గౌరవమో సన్నిహితంగా ఉన్న సందర్భంలో చూసినట్లు చెప్పారు. మతోన్మాదులను అడ్డుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న నేత కేసీఆర్ అని ప్రశంసించారు.

  ‘MEGA154’ సెట్‌లో కృష్ణంరాజుకు నివాళులు

  దిగ్గజ నటుడు కృష్ణంరాజు మృతికి ‘MEGA154’ మూవీ టీం నివాళులు అర్పించింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్‌లో కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాల వేసి చిత్రబృందం నివాళులు అర్పించింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు డైరెక్టర్ బాబీ, స్టార్ యాక్టర్ ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. కాగా చిరంజీవి నిన్న కృష్ణంరాజు ఇంటికెళ్లి ఆయనకు నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. Courtesy Twitter:

  మళ్లీ డైరెక్టర్ అవతారం ఎత్తనున్న ప్రకాశ్ రాజ్

  కొద్దికాలంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న నటుడు ప్రకాశ్ రాజ్ మళ్లీ డైరెక్టర్ గా మారేందుకు సిద్ధమవుతున్నాడు. సామాజిక అంశాలే ఇతివృత్తంగా ఉండే కథాంశాలను తెరకెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ మేరకు త్వరలో ‘మనలో ఒకడు’ అని టైటిల్ తో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా విషయాలు త్వరలో చెబుతానని వెల్లడించాడు. కాగా గతంలో ఇదే మూవీ టైటిల్ తో ఆర్పీ పట్నాయక్ ఓ సినిమా చేశాడు. అయితే ప్రకాశ్ రాజ్ ఎంచుకున్న కథాంశం భిన్నమైనదని తెలిసింది.