శరవణ స్టోర్స్ అధినేత లెజెండ్ శరవణన్.. సినిమాలపై ఆసక్తితో గతేడాది ‘లెజెండ్’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. మరోవైపు అనేక మంది శరవణన్‌పై ట్రోల్స్ కూడా చేశారు. అయితే శరవణన్ ప్రస్తుతం లుక్ మార్చారు. నయా లుక్‌తో ఫోటోలు పోస్ట్ చేశారు. త్వరలోనే వివరాలు చెబుతానంటూ మరో సినిమాకు సంబంధించి హింట్ ఇచ్చారు.
ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించడం కోసం కొన్ని చోట్లు ఉచితంగా టికెట్లు పంపిణీ చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చిన శరవణన్ పేరు మాత్రం మార్మోగింది. సినిమా కోసం భారీగానే ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. ఊర్వశీ రౌటేలా, నాసర్, ప్రభు, సుమన్ వంటి భారీ తారాగణం సినిమాను నిలబెట్టలేకపోయింది.
ప్రస్తుతం శరవణన్ న్యూ లుక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇందులో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆయన…. లుక్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే చెబుతానని వెల్లడించారు.
సరికొత్త లుక్‌లోకి మారిపోవటంతో మరో సినిమా త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కథ ఫైనల్ అవ్వగా పూజ కార్యక్రమాలు జరుగుతాయని సమాచారం.
వ్యాపారంలో రాణించినప్పటికీ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శరవణన్. కానీ, అతడిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.
హీరో మెటీరియల్ కాదంటూ కామెంట్లు పెట్టిన వారు లేకపోలేదు. వారందరికీ సమాధానం సరికొత్త లుక్ అంటూ లెజెండ్ శరవణన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
Celebrities Featured Articles
Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!