‘శాకుంతలం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్
సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. మల్లికా.. మల్లికా అంటూ సాగే ప్రేమగీతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో సమంత అందాలు ఆరబోసింది. సమంత నడుము సొగసు చూపిస్తూ అందాల దేవతలా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ విశేషంగా అలరిస్తోంది. సమంతకు జోడీగా దేవ్ మోహన్ నటించారు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.