• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మైదానంలోకి మద్యం తీసుకెళ్లేందుకు పాట్లు

    ఫిఫా ప్రపంచ కప్ జరుగుతున్న స్టేడియం పరిసర ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించిన వేళ ఓ [వీడియో](url) వైరల్ అవుతోంది. మెక్సికో చెందిన ఓ అభిమాని తన బైనాక్యులర్స్ లో మద్యం తీసుకువచ్చాడు. భద్రతా సిబ్బంది అతడిని చెక్ చేశారు. ముందు బైనాక్యులర్స్ అని వదిలేసినప్పటికీ..తర్వాత అనుమానంతో పరిశీలించారు. అందులో మద్యం నింపుకొని మూతలు పెట్టి తీసుకువచ్చాడు. శానిటైజర్ అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. A Mexico fan tried to to sneak in alcohol in binoculars and still … Read more

    మృత్యుంజయుడు..2 రోజులు శిథిలాలకిందే

    ఇండోనేషియాలో భూకంప తీవ్రతకు 271 మంది మరణించగా.. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఓ ఆరేళ్ల [బాలుడు ](url)రెండు రోజులుగా శిథిలాల కిందే ఉండిపోయాడు. భూకంపం ధాటికి తన ఇళ్లు కూలిపోవడంతో ఆ శిధిలాల కిందే చిక్కుకుని ఆహారం, నీరు లేకుండా ఉన్నాడు. చివరకు రెండు రోజుల తర్వాత ఆ బాలుడిని రెస్క్యూ టీం రక్షించింది. విచిత్రమేంటంటే ఆ బాలుడి తల్లి, అమ్మమ్మ ఇద్దరూ శిథిలాల కిందే మృతి చెందారు. వారి మృతదేహాల పక్కనే ఆ బాలుడు రెండు రోజులు గడిపాడు. Six-year-old … Read more

    మరోసారి ఆకట్టుకున్న జపాన్ ఫ్యాన్స్

    ఫుట్‌బాల్ స్టేడియంలో చెత్త ఏరి జపాన్ ఫ్యాన్స్ మరోసారి అందరి మనసు దోచుకున్నారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో జపాన్ 2-1 తేడాతో గెలిచింది. ఈ సందర్భంగా సంబరాలు చేసుకున్న జపాన్ ఫ్యాన్స్.. స్టేడియంలో ఉన్న పేపర్లు, జెండాలు, బ్యానర్లు, పోస్టర్లను ఏరి బయటికి తీసుకురావడం ఆశ్చర్యం కలిగించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను ఫిఫా వరల్డ్‌కప్ ఇంటర్నెట్‌లో పెట్టింది. అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. జపాన్ ఫ్యాన్స్ పరిశుభ్రతకు అందరూ ఫిదా అవుతున్నారు. Tidying up after one of their … Read more

    న్యూయార్క్‌లో హిమపాతం.. ఇద్దరు మృతి

    అమెరికా నగరం న్యూయార్క్ మంచు దుప్పట్లో కూరుకుపోయింది. హిమపాతం ధాటికి ఏకంగా ఇద్దరు మృతి చెందారు. రానున్న 24 గంటల్లో అధిక హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని చోట్ల ఆరడగుల మేర హిమపాతం కురుస్తోంది. పశ్చిమ న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. రహదారులు మంచుతో కప్పుకుపోయాయి. వాహనాల రాకను అధికారులు నిషేధించారు. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. Very rare thundersnow in Buffalo, NY: pic.twitter.com/Ps4fZEe8iV — … Read more

    ఎస్కార్ట్‌తో ఫిఫా వరల్డ్‌కప్‌నకు పోలాండ్

    ఖతార్ వేదికగా జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనడానికి పోలాండ్ జట్టు ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్‌తో రావడం సంచలనంగా మారింది. మధ్యలో ఆటగాళ్లు ఉన్న విమానం ఉండగా.. చుట్టూ ఫైటర్ జెట్స్ [ఎస్కార్ట్‌](url)గా వెళ్లాయి. కాగా వారు ఎస్కార్ట్‌తో రావడానికి బలమైన కారణం ఉంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం వల్లే వాళ్లు ఇలా వచ్చారు. ఈ రెండు దేశాల సరిహద్దులను దాటుకుని పోలాండ్ ఖతార్ రావాల్సి ఉంటుంది. దీంతో పోలాండ్ ప్రభుత్వం ఫైటర్ జెట్స్ సాయంతో జట్టును ఖతార్‌కు పంపించింది. Poland's army sent two … Read more

    రష్యా క్షిపణిని కూల్చిన ఉక్రెయిన్ సేనలు

    [VIDEO:](url) ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా సేనలు క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేస్తున్నాయి. రష్యా మిసైల్ దాడులను ఉక్రెయిన్ సైతం అదే స్థాయిలో తిప్పికొడుతోంది. తాజాగా తక్కువ ఎత్తులో వచ్చి రష్యా క్రూయిజ్ క్షిపణిని ఉక్రెయిన్ సేనలు ధ్వంసం చేశాయి. ఈ వీడియోను ఉక్రెయిన్ అధికారులు షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Spectacular footage: Two Russian Kalibr cruise missiles shot down within seconds over Kyiv Oblast … Read more

    ప్రముఖ సింగర్ కు చేదు అనుభవం

    అమెరికా లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు హ్యరీ స్టైల్స్ కంటికి స్వల్ప గాయం అయ్యింది. స్టేజిపైకి వచ్చిన అతడిపై కొందరు క్యాండీస్ విసిరారు. అవి హ్యారీ కంట్లో తాకటంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో కాసేపు కంటిని నలిపి తిరిగి అభిమానులకు అభివాదం తెలిపారు. ఈ ఘటనపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి [దాడి](url) చేయడం సరికాదని పోస్ట్ లు పెడుతున్నారు. గాయపడినప్పటికీ అభిమానుల పట్ల అతడు ప్రేమ చూపించడంపై మెచ్చుకుంటున్నారు. It was HORRIBLE. I can’t … Read more

    కెనడా ప్రధానిపై జిన్ పింగ్ అసంతృప్తి !

    జీ-20 సమావేశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య సంభాషణ ఇప్పుడు [వైరల్](url) అవుతోంది. సదస్సు వేదికగా ఇద్దరు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఆ సమాచారం మీడియాలో రావటం పట్ల జిన్ పింగ్ అసహనం వ్యక్తంచేశారు. చర్చలు జరిపే విధానం ఇది కాదంటూ వ్యాఖ్యానించారు. తమ దేశంలో ప్రతిదీ పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని భావిస్తామని..అది కొనసాగిస్తామని ట్రూడో చెప్పారు. కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం కానీ, కొన్ని సందర్భాల్లో ఏకాభిప్రాయం కుదరంటూ బదులిచ్చారు. The Cdn Pool cam … Read more

    జీ-20 సదస్సు ప్రారంభం

    ఇండోనేషియాలోని బాలిలో జీ-20 సదస్సు ప్రారంభమయ్యింది.. రెండ్రోజులపాటు నిర్వహించనున్న సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రవంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇండోనేషియా వెళ్లారు. సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కాసేపు మాట్లాడారు. జీ-20 నాయకులతో సవాళ్లు, వృద్ధి, ఆహారం, పర్యావరణఁ, ఆరోగ్యం, డిజిటల్ మార్పుల గురించి ఆలోచనలు విస్తరిస్తానని మోదీ చెప్పారు.

    ఇస్తాంబుల్ లో మానవబాంబు పేలుడు!

    ఇస్తాంబుల్ లోని ఇస్తిక్ లాల్ అనే రద్దీ గా ఉండే ఓ వ్యాపార ప్రదేశంలో పేలుడు సంభవించింది. ఇందులో ఆరుగురు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా పేలుడు జరగటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఎక్కడివారక్కడ భయంతో పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఓ [వీడియో](url) వైరల్ అయ్యింది. పేలుడుకు మానవ బాంబు కారణమని అనుమానిస్తున్నామని అధికారులు తెలిపారు. తీవ్రవాద దాడిగా ప్రాథమికంగా నిర్ధారించారు. A piece of garbage blew himself up in the middle of a crowded area … Read more