• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెండు విమానాలు ఢీకొని ఆరుగురు మృతి

    అమెరికా- డల్లాస్‌​లో నిర్వహించిన ఎయిర్​ షోలో ఘోర ప్రమాదం సంభవించింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి రెండు విమానాలు.. గాలిలో ఢీకొని పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద [దృశ్యాలు](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శనివారం జరగిన ఎయిర్ షోలో బోయింగ్​ బీ-17 నేల మీద నుంచి గాలిలో ఎగిరి.. స్ట్రెయిట్​ లైన్​లో ప్రయాణం మొదలుపెట్టింది. ఇంతలో.. బెల్​ పీ-63 అటువైపు దూసుకెళ్లింది. అందరు చూస్తుండగానే.. బెల్​ పీ- 63.. బోయింగ్​ బీ-17ని ఢీకొట్టింది. క్షణాల్లో రెండు విమానాలు నేల … Read more

    సరస్సులో కూలిన విమానం

    ఆఫ్రికాలోని టాంజానియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుకోబా నగరంలోని విక్టోరియా సరస్సులో విమానం కూలిపోయింది. ఎయిర్‌పోర్టుకి 100 మీటర్ల దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ప్రమాద సమయంలో విమానంలో 49మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన విపత్తు స్పందన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రెసిషన్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన విమానం దార్ ఎస్ సలాం నుంచి బుకోబాకు ఈ విమానం బయలుదేరినట్లు సమాచారం. Precision Air plane crashes into Lake Victoria … Read more

    మనవరాలికి జన్మనిచ్చిన బామ్మ

    56 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు జన్మనిచ్చి తన మాతృత్వాన్ని చాటుకుందో మహిళ. అమెరికాలోని ఉతా ప్రాంతానికి చెందిన జెఫ్ హాక్, కాంబ్రియా దంపతులు. కాంబ్రియాకు అనారోగ్యానికి గురి కావడంతో గర్భసంచిని వైద్యులు తొలగించారు. ఇదివరకే వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయినా మరొక సంతానం కావాలని అభిలషించారు. దీంతో సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వడానికి జెఫ్ తల్లి ఒప్పుకొన్నారు. అలా తొమ్మిది నెలల పాటు గర్భాన్ని మోసి మనవరాలికి జన్మనిచ్చారు నానమ్మ. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంతో ఉన్నారు. View this post on … Read more

    వేతనాలు ఇస్తేనే యుద్ధం: రష్యా సైన్యం

    ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ సైన్యంలో చేరిన వాలంటీర్ల నుంచి రష్యాకు నిరసన సెగ తగిలింది. వేతనాలు చెల్లించడం లేదని తక్షణమే చెల్లించే వరకు పోరాడబోమని చెబుతున్న ఓ [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సైన్యంలో చేరితే తమ కుటుంబాలకు చెల్లిస్తామన్న సుమారు 5000 డాలర్లు ఇంకా ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. అవి ఇచ్చే వరకు తాము సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. యుద్ధం కోసం రెట్టింపు జీతం చెల్లిస్తామని మాస్కో వాలంటీర్లను చేర్చుకుంది. Russian mobiks are demanding the "promised" … Read more

    ట్విటర్ ఆఫీస్‌లో ఎలన్ మస్క్

    శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో ఎలన్ మస్క్ టాయిలెట్ శింకుతో అడుగు పెట్టారు. తన బయోలో కూడా ‘చీఫ్ ట్విట్’ అని మార్చారు. ‘మొత్తానికి కార్యాలయంలోకి వచ్చేశా. ఈ శింకు ఇక్కడే ఉండనీ’ అంటూ మస్క్ అందులో రాసుకొచ్చారు. దీంతో ట్విటర్ డీల్ ఈ వారంలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 13బిలియన్ డాలర్లు ట్విటర్ చేతికి అందినట్లు సమాచారం. మార్చిలోనే 44బిలియన్ డాలర్లకు డీల్ కుదిరింది. కానీ, అనేక మలుపుల అనంతరం తిరిగి అదే ధరకు మస్క్ ట్విటర్‌ కొనుగోలుకు ఒకే … Read more

    పాక్ ఆర్థిక మంత్రికి చేదు అనుభవం

    అమెరికాలో పాకిస్తాన్ ఆర్థికశాఖ మంత్రి ఇషాక్ దార్‌ను కొందరు హేళన చేశారు. ‘చోర్ చోర్’.. ‘యూ ఆర్ లైర్’ అంటూ ఇషాక్‌ను వెంబడించారు. ఈ ఘటన వాషింగ్టన్ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుండడంతో ఇషాక్ రుణాలు తీసుకువచ్చేందుకు అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు ఈ అవమానం ఎదురైంది. కాగా పాక్‌లో నెలకొన్న గడ్డు పరిస్థితుల కారణంగా గత నాలుగేళ్లలో 5 మంది ఆర్థిక మంత్రులు ఆ పదవిని వదులుకున్నారు. Ishaq Dar (The Looter, The Liar) Insulted … Read more

    ఘోరం.. 17మంది సజీవదహనం

    వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను విధి వంచించింది. బస్సులో వేరే ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదం బారిన పడి 17మంది సజీవదహనమయ్యారు. పాకిస్థాన్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ‘బస్సుకు వెనకాల మంటలు అంటుకున్నాయి. అప్పుడు బస్సులో 35మంది ఉన్నారు. భయంతో కొంతమంది దూకేశారు. 10మందికి గాయాలయ్యాయి. పునరావాస కేంద్రం నుంచి సొంత జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది’ అని పోలీసులు తెలిపారు. ఆగస్టులో కూడా పంజాబ్ రాష్ట్రంలో బస్సు దగ్ధమై 20మంది సజీవదహనం కావడం గమనార్హం. BREAKING ?? : At … Read more

    డేవిడ్‌ మిల్లర్‌ కుమార్తె కన్నుమూత

    దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ కుమార్తె క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని డేవిడ్‌ మిల్లర్‌ స్వయంగా వెల్లడించాడు. ‘మై లిటిల్ రాక్‌స్టార్‌.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ ఓ ఎమోషనల్‌ వీడియో ను పోస్టు చేశాడు. ఈరోజు రాంచీ వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో మిల్లర్‌ ఆడాల్సి ఉంది.తాజా ఘటనతో సౌతాఫ్రికా జట్టులో విషాదఛాయలు అలముకున్నాయి. View this post on Instagram A post shared by Dave Miller (@davidmillersa12)

    వావ్‌ కోహ్లీ! నవ్వొక గ్రేట్ టీం ప్లేయర్‌!!

    ఆదివారం ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా మ్యాచ్‌లో టీమిండియా టాప్‌ ఫోర్‌ బ్యాటర్స్‌ చితక్కొట్టారు. ఇటీవలే ఫామ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ కూడా చెలరేగి ఆడాడు. అయితే ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో కోహ్లీ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చివరి ఓవర్‌లో 49 రన్లతో కోహ్లీ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్నాడు. డీకే స్ట్రయిక్‌ చేస్తున్నాడు. అయితే కోహ్లీ హాఫ్‌ సెంచరీ కోసం సింగిల్‌ తీసి ఇవ్వాలా డీకే అడిగినప్పుడు..అదేం వద్దు నీ ఆట నువ్‌ ఆడు అన్నట్లుగా కోహ్లీ చెప్పాడు. దీనికి … Read more

    ఫ్లోరిడాను వణికిస్తున్న హరికేన్

    భీకరమైన హరికేన్ అయాన్ తుపాను సృష్టించిన విపత్తుతో ఫ్లోరిడా వణికిపోతోంది. 240కిలోమీటర్ల వేగంతో వేస్తున్న గాలులు ప్రజలను భయపెడుతున్నాయి. నేపుల్స్‌లో వరదలు సంభవించాయి. వాహనాలు నీటిలో మునిగిపోయాయి. చెట్లు నేలకొరిగాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. దక్షిణ ఫ్లోరిడాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. జార్జియా, సౌత్ కరోలినాల్లో కూడా హరికేన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి భీకర హరికేన్లు అరుదుగా వస్తాయంటున్నారు నిపుణులు. Wind, rain batter Ft. Myers as Hurricane Ian engulfs Florida's west coast. LIVE … Read more