• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారతీయులను ఆకట్టుకున్న 5 అద్భుతమైన బైక్స్‌ గురించి తెలుసా?

    మార్కెట్‌లోకి రోజుకో కొత్త బైక్‌ వస్తుంటుంది. పోతుంటుంది కానీ అన్నీ అందరికీ నచ్చవు. కొన్ని మాత్రమే జనాలను ఆకర్షిస్తాయి. మార్కెట్‌లో సత్తా చాటుతాయి. వాటి ఉత్పత్తి ఆగిపోయినా వాటి పేర్లు మాత్రం లెంజెండ్స్‌గా మిగిలిపోతాయి. కాలక్రమంలో కనిపించకుండా పోయినా… ఎక్కడో ఓ చోట మళ్లీ పాత బైక్‌ రోడ్డుపై కనిపిస్తే ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షిస్తాయి. ఇండియాలో అలా వాహనప్రియుల మనసులు దోచిన టాప్‌-5 బైక్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

    బుల్లెట్‌

    బుల్లెట్‌ అంటే ఇష్టపడని వారుండరు. రాజసం ఉట్టిపడేలా ఉండే ఈ బైక్‌ను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ తయారు చేస్తోంది. ‘మేడ్‌ లైక్‌ ఎ గన్‌ గోస్‌ లైక్‌ ఎ బుల్లెట్‌’ అంటూ సంస్థ బైక్‌ను ప్రమోట్‌ చేస్తోంది. ఒకప్పుడు సెన్సేషనల్‌ బైక్‌గా ఉన్న వీటి ఉత్పత్తి మధ్యలో ఆగిపోయింది. కానీ 2007లో సరికొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ఒక్కసారిగా టూ వీలర్‌ మార్కెట్‌ను షేక్‌ చేసింది. అప్పటిదాకా పూర్తి క్యాస్ట్‌ ఐరన్‌తో చేస్తున్న బైక్స్‌ను అల్యూమినియం అల్లాయ్‌తో తయారు చేయడం మొదలుపెట్టి బరువు తగ్గంచారు. నాటి రాజసం తగ్గకుండా నేటి అత్యాధునికత మిస్‌ కాకుండా తీసుకొచ్చి మార్కెట్‌లో టాప్‌గా నిలిపారు. ప్రస్తుతం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌, క్లాసిక్‌ 350 మార్కెట్‌లో టాప్‌ సెల్లింగ్‌ బైక్స్‌లో ఉన్నాయి.

    Yamaha RX100

    బుల్లెట్‌ కాస్త కాస్ట్‌లీ బైక్‌ కానీ సూపర్‌ కూల్‌ లుక్‌లో ఇప్పటికీ యువతను ఆకట్టుకునే 100CC బైక్‌ Yamaha RX100. 1885-96 మధ్య యమహా కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ బైక్‌ ఇండియాలోని మోస్ట్‌ లవ్‌డ్‌ బైక్‌ అనడంలో అతిశయోక్తి లేదు. ఎయిర్‌ కూల్‌డ్‌, రీడ్‌ వాల్వ్‌, టూ స్ట్రోక్‌ ఇంజిన్‌తో వచ్చిన ఈ బైక్‌ అప్పట్లో డ్రాగ్‌ రేసర్లతో పాటు యూత్‌ను అమితంగా ఆకట్టుకుంది. దీని డిజైన్‌, ఫైరింగ్‌కు నేటి కాలం యువత కూడా వీరాభీమానులు. మళ్లీ దీనిని మార్కెట్‌లోకి తీసుకురావాలని ఎంతో మంది భారతీయులు కోరుకుంటున్నారు. కంపెనీ కూడా నేటి చట్టాలు, అవసరాలకు అనుగుణంగా RX100 వారసత్వాన్ని కొనసాగించాలని భావిస్తోంది. త్వరలోనే RX100 సక్సెసర్‌ను మార్కెట్‌లో చూడొచ్చేమో.

    BAJAJ Chetak

    నాన్న బైక్‌ నడుపుతుంటే మధ్యలో హ్యాండిల్‌ పట్టుకుని నిలుచుని వెళ్లిన మధుర జ్ఞాపకాలు మీలో ఎంతో మందికి ఉండుంటాయి కదా!. హమారా బజాజ్‌ అంటూ వచ్చే యాడ్‌ ఇప్పటికీ చాలా మనసుల్లో నాటుకుపోయి ఉంటుంది. 1972 నుంచి 2006 వరకు బజాజ్‌ సంస్థ చేతక్‌ ఉత్పత్తిని కొనసాగించింది. ప్రసిద్ధి గాంచిన యుద్ధవీరుడు మహరాణా ప్రతాప్‌ గుర్రం ‘చేతక్‌’ పేరు మీదుగా ఈ బైక్‌కు ఆ పేరు వచ్చింది. మిలియన్ల భారతీయులను ఆకట్టుకున్న ఈ బైక్‌ ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తుంది.

    SUZUKI SAMURAI

    1990sలో హీరో బైక్‌ అనగానే గుర్తొచ్చే సౌండ్‌ సమురాయ్‌దే. సూపర్‌ కూల్‌ ఫైరింగ్‌తో స్పోర్టివ్‌ డిజైన్‌తో అప్పట్లో యూత్‌ని అమితంగా ఆకట్టుకున్న బైక్‌ ఇది. సుజుకి నుంచి వచ్చి 2-స్ట్రోక్ సుజుకి AX100 యొక్క కాపీనే సమురాయ్‌. 1998లో ఉత్పత్తి మొదలై చాలా తక్కువ కాలంలోనే ఆగిపోయింది. అప్పట్లో ఇది భారతదేశంలోనే అత్యంత టార్కియర్‌ ఇంజిన్‌గా ప్రసిద్ధి గాంచింది.

    KINETIC HONDA

    ఈ బైక్‌ కూడా చాలా మందికి చిన్ననాటి మధుర స్వప్నంగా ఉంటుంది. కైనెటిక్ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌, హోండా మోటార్‌ కంపెనీ కలిసి 1984 నుంచి 1998 వరకూ వీటిని ఉత్పత్తి చేశాయి. ఆ తర్వాత ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం ముగియడంతో ఉత్పత్తి ఆగిపోయింది. కైనెటిక్‌ సంస్థ అదే పేరుతో కొంతకాలం బైక్‌లను ఉత్పత్తి చేసినా అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 

    వీటితో పాటు రాజ్‌ధూత్‌, యేజ్డీ, వెస్పా ఇలా చాలా బైక్స్‌ భారతీయులను ఆకట్టుకున్నాయి. మీకు గుర్తున్న మీకు బాగా నచ్చిన బైక్‌ ఏదైనా ఉంటే కామెంట్‌ రూపంలో తెలియజేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv