• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్ ప‌ని అయిపోనట్లేనా..?

    ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీ బీజేపీ దూసుకుపోతోంది. ఇదే స‌మ‌యంలో మ‌రో జాతీయ పార్టీ అయిన‌ కాంగ్రెస్ ఢీలా ప‌డిపోయింది. అధికారంలో ఉన్న పంజాబ్ లో మూడో స్థానానికి ప‌డిపోయింది. మ‌రే రాష్ట్రంలోనూ మిగ‌తా పార్టీల‌కు క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌లేక‌పోయింది. దీంతో కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది. 2019 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల త‌ర్వాత రాహుల్ గాంధీ అధ్య‌క్ష‌ప‌ద‌వికి గుడ్ బై చెప్పారు. ఆ త‌ర్వాత సోనియా గాంధీనే మ‌ళ్లీ అధ్య‌క్ష చేప‌ట్టాల్సి వ‌చ్చింది. దీంతో సీనియ‌ర్ నేత‌లు పార్టీని ప్ర‌క్షాళనం చేయాల‌ని అధిష్ఠానానికి లేఖ రాశారు. ఈ చ‌ర్య‌కు ఫ‌లితంగా ఆ లేఖ రాసిన, మ‌ద్ద‌తిచ్చిన‌ వారంద‌రినీ పార్టీ కార్య‌క‌లాపాలకు దూరంగా పెట్టారు. ఈ క్ర‌మంలో మంచి ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కులు ఒక్కొక్క‌రుగా పార్టీని వీడ‌టం మొద‌లు పెట్టారు. దీంతో కాంగ్రెస్ ప‌రిస్థితి నానాటికీ ద‌య‌నీయంగా మారుతోంది. మోదీ-షా ద్వ‌యం వేసే ఎత్తుల‌కు ఆ పార్టీ ద‌గ్గ‌ర జ‌వాబు లేకుండా పోయింది. ఇక‌, ప్రాంతీయ పార్టీలు సైతం కాంగ్రెస్ వైపు చూడ‌ట‌మే మానేశాయి. మూడో ఫ్రంట్ అంటూ తిరుగుతున్న కేసీఆర్ అసలు కాంగ్రెస్ ఊసే ఎత్త‌డం లేదు. ఇదిలా ఉంటే.. ఒక‌ప్పుడు దేశ వ్యాప్తంగా పాల‌న సాగించిన కాంగ్రెస్ ప్ర‌స్తుతం రెండు రాష్ట్రాల‌కే ప‌ర‌మిత‌మ‌యింది. మ‌రోవైపు కేవ‌లం ఒక్క రాష్ట్రంలో అధికారం సాధించిన ఆప్ ప్ర‌స్తుతం పంజాబ్ లో పూర్తి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv